DC vs MI: ఇ'స్మార్ట్' ఇషాన్ కిషన్.. ముంబై చేతిలో చిత్తయిన ఢిల్లీ!

దుబాయ్: ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆ జట్టు మరో అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ముంబై 9 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (3/17), ట్రెంట్ బౌల్ట్ (3/21) రఫ్ఫాడించడంతో ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ముంబై.. ఆ తర్వాత ఇషాన్ కిషన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్) ఇస్మార్ట్ ఇన్నింగ్స్‌తో అలవోక విజయాన్నందుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25), రిషభ్ పంత్ (21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 111 పరుగులు చేసి సునాయంగా గెలుపొందింది. ఇషాన్‌కు తోడుగా డికాక్(26), సూర్యకుమార్ యాదవ్ (12 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ దారుణ ఓటమితో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.
ఇక 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై మంచి బంతులను గౌరవిస్తూ ఓపికగా ఆడారు. తొలి మూడు ఓవర్లలో ఈ జోడీ కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టకపోవడంతో ముంబై 10 పరుగులు మాత్రమే చేసింది.
ఇక నోర్జ్ వేసిన నాలుగో ఓవర్‌లో మూడు బౌండరీలు కొట్టిన ఇషాన్.. రబడా వేసిన ఆరో ఓవర్‌లో మరో రెండు బౌండరీలు రాబట్టడంతో ముంబై పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. మరోవైపు నిదానంగా ఆడిన డికాక్ తాను ఎదుర్కొన్న 20వ బంతికి ఫోర్ కొట్టాడు. డికాక్ నెమ్మదిగా ఆడినా ఇషాన్ ధాటిగా ఆడాడు. తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించిన అనంతరం నోర్జ్ బౌలింగ్‌లో అన్‌లక్కీగా డికాక్ బౌల్ట్ అయ్యాడు. అయినా ఓవర్‌కో బౌండరీ కొట్టిన ఇషాన్ మిగతా పనిని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications