న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs CSK: కార్తీక్‌కు కఠిన పరీక్ష.. నెగ్గుతాడా? ధోనీ ముందు తేలిపోతాడా? తుది జట్లు ఇవే!

IPL 2020, KKR vs CSK: Who will win Kolkata Knight Riders vs Chennai Super Kings

అబుదాబి: ఐపీఎల్ 2020లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం జరిగేలీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత కింగ్స్ పంజాబ్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది. అయితే ఇక్కడ మ్యాచ్ కంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. స్టార్ ఆటగాళ్లున్నా జట్టు ఓడిపోతుండటంతో డీకే కెప్టెన్సీ వైఫల్యం చర్చకు దారి తీస్తుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలవకపోతే కార్తీక్ కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇక నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదింటిలో రెండు గెలిచిన సీఎస్‌కే ఐతో స్థానంలో ఉంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్సే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరీ ఈ మ్యాచ్‌లో గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

కార్తీక్‌కు అగ్ని పరీక్ష

కార్తీక్‌కు అగ్ని పరీక్ష

ఈ మ్యాచ్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీకి ఇజ్జత్‌కే సవాల్‌గా మారింది. లీగ్‌లో రెండు గెలిచి మరో రెండు ఓడిన కేకేఆర్.. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ నాలుగు మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ విఫలమయ్యాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా అతని నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఇంగ్లండ్ క్రికెటర్ ఇయా మోర్గాన్ టీమ్‌లో ఉన్నా.. కేకేఆర్ మేనేజ్‌మెంట్ కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో డీకే విఫలమవుతూనే ఉన్నాడు. టాప్ క్లాస్ ప్లేయర్లను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు కేకేఆర్ అభిమానులు కూడా మోర్గాన్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో నేటి మ్యాచ్ డీకేకి అగ్ని పరీక్షగా మారింది.

శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి ఫామ్‌లో ఉన్నారు. డేకే తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. వీరు రాణిస్తే కేకేఆర్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. గత నాలుగు మ్యాచ్‌లో విఫలమైన సునీల్ నరైన్‌‌ను పక్కన పెట్టవచ్చు. అతని స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ టామ్ బాంటన్‌ను తీసుకోవచ్చు. ఇక కమిన్స్, నాగర్ కోటి, శివమ్ మావి, వరుణ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.

ఉత్సాహంగా చెన్నై..

ఉత్సాహంగా చెన్నై..

హ్యాట్రిక్ ఓటముల తర్వాత చెన్నై గాడిలో పడింది. షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం అతిపెద్ద సానుకూలాంశం. ఫాఫ్ డుప్లెసిస్ మంచి టచ్‌లో ఉండగా.. రాయుడు కూడా కుదురుకుంటే తిరుగుండదు. డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కరన్ చెలరేగితే నైట్‌రైడర్స్‌కు కష్టాలు తప్పవు. ఫినిషర్‌గా ధోనీ తన మార్క్ చూపితే.. సీఎస్‌కే‌కు తిరుగుండదు. బౌలింగ్‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు. జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మొకాలికి ఐస్ ప్యాక్ పెట్టుకున్నా.. మ్యాచ్‌కు దూరమయ్యేంత గాయమైతే కాదు.

తుది జట్లు:

తుది జట్లు:

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, కీపర్), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

బ్యాటింగ్, బౌలింగ్ అనుకూలంగా ఉండే వికెట్. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఈ మైదానంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖాముఖి..

ముఖాముఖి..

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 13-7తో చెన్నై లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని సీఎస్‌కే భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో కేకేఆర్ ఉంది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైనే విజయం వరించింది.

ఏందీ ఈ పొట్ట.. పృథ్వీ షాను ఆటపట్టించిన విరాట్ కోహ్లీ!

Story first published: Wednesday, October 7, 2020, 14:56 [IST]
Other articles published on Oct 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X