For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏందీ ఈ పొట్ట.. పృథ్వీ షాను ఆటపట్టించిన విరాట్ కోహ్లీ!

IPL 2020: Virat Kohli Trolls about Prithvi Shaws Tummy in the Practice session

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌లో దూసుకెళుతోంది. ముందుగా బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో చెలరేగడంతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ చిత్తుగా ఓడింది. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 59 పరుగుల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీషాను ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా ఆటపట్టించాడు.

టాస్ సమయంలో పృథ్వీ షా, రవిచంద్రన్ అశ్విన్‌తో సరదాగా మాట్లాడిన విరాట్.. ఈ సందర్భంగా పృథ్వీషా వద్దకు వస్తూనే అతని పొట్టను గిల్లుతూ టీజ్ చేశాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డువ్వడంతో పాటు మ్యాచ్ ప్రారంభానికి ముందు వచ్చే మ్యాచ్ ప్రజెంటేషన్‌ షోలో ప్రసారమైంది.

రోహిత్‌తో పోటీనా?

ఇది చూసిన అభిమానులు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్స్‌తో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. పృథ్వీ షా ఏందీ ఈ పొట్ట.. అని విరాట్ భాయ్ అడుగుతున్నారని ఒకరంటే.. పొట్టలో రోహిత్ శర్మతో పోటీపడుతున్నావా? ఏందని విరాట్ ప్రశ్నించాడని ఫన్నీ క్యాప్షన్ ఇస్తున్నారు. ఇలా అయితే ఎక్కువ రోజు‌లు క్రికెట్ ఆడలేవని, కొంచెం తగ్గించు అని విరాట్ సలహా ఇచ్చాడని సెటైర్స్ వేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లంతా కొంత బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ అనంతరం కూడా పృథ్వీ షాతో విరాట్ చాలా సేపు ముచ్చటించాడు. సరదాగా జోకులు వేస్తూ నవ్వుకున్నారు.

‘షా'న్‌దార్‌ ఇన్నింగ్స్‌...

‘షా'న్‌దార్‌ ఇన్నింగ్స్‌...

ఈ జోక్స్ పక్కనపెడితే.. పృథ్వీ షా ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో (5, 64, 2, 66, 42) రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తోనే ఢిల్లీ శుభారంభాలను అందుకుంటుంది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కూడా షా చెలరేగాడు. ఉడాన వేసిన తొలి ఓవర్లోనే అతను మూడు బౌండరీలు బాదాడు. సైనీ ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అతను కొట్టిన సిక్సర్‌ మ్యాచ్‌కే హైలైట్. ఆ వెంటనే కోహ్లి ఐదో ఓవర్లోనే చహల్‌కు బంతి అప్పగించినా.. పృథ్వీ అతన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. వరుస బంతుల్లో 4, 6 సిక్స్‌ కొట్టాడు. పృథ్వీ దూకుడుతో 4.5 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 50కి చేరింది. బెంగళూరు శిబిరాన్ని కలవరపెట్టిన ఈ జోడీని సిరాజ్‌ 7వ ఓవర్లో విడదీయడంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మరో సెహ్వాగ్..

మరో సెహ్వాగ్..

అచ్చం టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లానే భారీ షాట్లు ఆడుతున్న పృథ్వీ షా.. వికెట్ల మధ్య కూడా అతనిలానే ప్రవర్తిస్తున్నాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయడానికి సెహ్వాగ్ పెద్దగా ఇష్టపడకపోయేవాడు. ఎక్కువగా బౌండరీలనే బాదేవాడు. ఆ శైలినే షా అనుకరిస్తున్నాడు. ఇది కొన్నిసార్లు జట్టుకు చేటు చేస్తుంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో షా బద్దకం కారణంగా ధావన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటికి వారి మధ్య పరుగు తీసే విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కూడా షా రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. షా ఫిట్‌నెస్‌పై ఇప్పటికే తీవ్ర చర్చ నడుస్తున్నా.. అతని భారీ ఇన్నింగ్స్‌ల కారణంగా అది పెద్ద సమస్యలా కనిపించడం లేదు. కానీ వికెట్ల మధ్య పరుగెత్తడం మెరుగుపరుచుకోకపోతే.. అటు షాకు ఇటు జట్టుకు కష్టాలు తప్పవని క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక బౌలింగ్‌కు అనుకూలించే వికెట్‌లపై క్విక్ సింగిల్స్, డబుల్సే విజయాలనందిస్తాయి.

IPL 2020 : Virat Kohli Becomes First Indian Batsman To Score 9,000 Runs in T20S | Oneindia Telugu
టేబుల్ టాపర్‌గా

టేబుల్ టాపర్‌గా

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్‌) చెలరేగగా... పృథ్వీషా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు 42) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ బౌలర్‌ మహ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్‌ నోర్జ్‌కు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్‌ చేసిన స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది.

విజయ గర్వం తలకెక్కిందా? ఢిల్లీ చేతిలో ఆర్‌సీబీ ఓటమికి కారణాలు ఇవేనా?

Story first published: Tuesday, October 6, 2020, 13:57 [IST]
Other articles published on Oct 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+