DC vs CSK: చెన్నైకి ప్లే ఆఫ్ పరీక్ష .. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకునేనా?

షార్జా: ప్లే ఆఫ్‌‌ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ ఐపీఎల్‌‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. వీకెండ్ కారణంగా ఈ రోజు జరిగే డబుల్ హెడర్‌లో రాత్రి జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ధోనీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం చూస్తే టేబుల్‌‌లో చెన్నై ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దాంతో చెన్నైకి ఈ మ్యాచ్‌‌ల్లో గెలవడం అత్యవసరం. మరీ టేబుల్‌‌ టాపర్‌‌గా ఉన్న ఢిల్లీని ఈ మ్యాచ్‌‌లో చెన్నై ఎంతమేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో ఢిల్లీనే 44 పరుగులతో గెలుపొందింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకోవడంతో పాటు తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీసుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంటున్న ఢిల్లీ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!

అదే స్ట్రాటజీ..

అదే స్ట్రాటజీ..

గత మ్యాచ్‌లో హైదరాబాద్‌‌పై అన్ని స్ట్రాటజీలు సమర్థంగా పని చేయడంతో ఈ మ్యాచ్‌‌లోనూ వాటిని కొనసాగించాలని కెప్టెన్‌‌ ధోనీ భావిస్తున్నాడు. సామ్‌‌ కరన్‌‌ను మరోసారి ఓపెనర్‌‌గా పంపించే చాన్స్‌‌ ఉంది. రన్స్‌‌ కట్టడి చేసేందుకు ఏడుగురు బౌలర్ల స్ట్రాటజీకి ధోనీ మరింత మెరుగులు పెట్టనున్నాడు. అయితే చెన్నై బ్యాటింగ్ మరింత మెరుగవ్వాల్సి ఉంది. షేన్ వాట్సన్, డూప్లెసిస్, అంబటి రాయుడు మరింత ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మ్యాచ్‌లో తన మార్క్ షాట్‌తో అలరించిన ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. బ్రావో, కరన్, చావ్లా, జడేజాతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. అనుభవపూర్వకమైన ఆటతో ఆకట్టుకుంటేనే కుర్రాళ్లు అయిన ఢిల్లీని చెన్నై కట్టడిచేయగలదు. లేకుంటే ధోనీసేకు కష్టాలు తప్పవు.

అయ్యర్ గాయం..

అయ్యర్ గాయం..

ఢిల్లీకి బ్యాటింగ్‌‌ బౌలింగ్‌‌లో పెద్దగా సమస్యల్లేవు. ఒకరు కాకపోతే మరొకరు అన్నట్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ అద్భుతం. రబడా ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ అయినా తీస్తున్నాడు. అతనికి తోడుగా నోర్జ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. గత మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బాల్‌ రికార్డు అందకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ జట్టును గాయల బెడదే ఇబ్బంది పెడుతుంది. ప్రతీ రెండు మ్యాచ్‌లకు ఒకరు గాయంతో దూరమవుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఫిట్‌‌నెస్‌‌పై ఆందోళన కొనసాగుతుంది. పంత్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. రహానే తన సత్తా చాటాల్సి ఉంది. అయినా శిఖర్ ధావన్‌‌, పృథ్వీ షా, స్టోయినిస్‌‌ కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం.

ముఖా ముఖి:

ముఖా ముఖి:

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడగా 15-7తో చెన్నై లీడ్‌లో ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీనే పైచేయి సాధించింది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ధోనీసేన భావిస్తోంది. గత సీజన్‌లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా మూడింటి మూడు చెన్నైనే గెలిచింది. చివరి ఆరు మ్యాచ్‌ల్లో మాత్రం చెన్నై 4 సార్లు గెలవగా.. ఢిల్లీ రెండు మ్యాచ్‌ల్లో పై చేయి సాధించింది.

తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, అన్రిచ్ నోర్జ్, తుషార్ దేశ్ పాండే

చెన్నై సూపర్ కింగ్స్: సామ్ కరన్, ఫాఫ్ డూప్లెసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ, పియూష్ చావ్లా

పిచ్ రిపోర్ట్:

షార్జా మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. కానీ గత మూడు మ్యాచ్‌లుగా పిచ్ చాలా నెమ్మదిగా మారింది. సులువుగా 200కు పైగా పరుగులు చేసిన ఈ మైదానంలో గత మూడు మ్యాచ్‌ల్లో మాత్రం 190కి లోపు స్కోర్లే వచ్చాయి. స్పిన్‌కు అనుకూలం. టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.

ప్యాంట్‌ మార్చుకోవడం మరచిన డికాక్.. నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్! (వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 17, 2020, 15:59 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X