ప్యాంట్‌ మార్చుకోవడం మరచిన డికాక్.. నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్! (వీడియో)

అబుదాబి: ఐపీఎల్‌‌‌‌ పదమూడో సీజన్‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌కు ఎదురేలేకుండా పోయింది. అరబ్‌‌‌‌ గడ్డపై అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తోంది. మరోసారి ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో చేసిన ముంబై‌‌.. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ను 8 వికెట్లతో చిత్తుగా ఓడించింది. తొలుత బౌలింగ్‌‌‌‌లో పంజా విసిరి ఆ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబై తర్వాత క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 నాటౌట్‌‌‌‌) మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో చిన్న టార్గెట్‌‌‌‌ను ఆడుతూ పాడుతూ ఛేజ్‌‌‌‌ చేసింది. లీగ్​లో ఆరో విక్టరీతో టేబుల్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు వచ్చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ జట్టు ఓపెనర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ మైదానంలోకి దిగాలనే ఆతృతలో ప్యాంట్ మార్చుకోవడం మరిచిపోయాడు.

ట్రెయినింగ్ ప్యాంట్‌తోనే సహచర ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ విషయాన్ని సహచర ముంబై ఆటగాళ్లు గుర్తించి చెప్పడంతో అయోమయానికి గురైన డికాక్.. మళ్లీ ప్యాంట్ మార్చుకోవడానికి డగౌట్‌వైపు పరుగు తీశాడు. ఇంతలో రోహిత్ ట్రెయినింగ్ ప్యాంట్ అని తెలిసేలా ఉన్న ఆరెంజ్ కలర్‌ను కవర్ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆగిపోయాడు. ఇన్ షర్ట్ తీసి కవర్ చేశాడు. అయితే ఈ ఘటనతో రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. హిట్‌మ్యాన్‌తో పాటు ముంబై డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అయితే టీవీ ముందున్న ప్రేక్షకులకు మాత్రం వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో ఆ సమయంలో అర్థం కాలేదు. కానీ కొంత మంది నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

తొలుత కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 రన్స్‌‌‌‌ చేసింది. పేసర్ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌‌‌‌) మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టగా.. కెప్టెన్సీ అందుకున్న ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్‌‌‌‌) రాణించాడు. . రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (2/18) రెండు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేశాడు. అనంతరం డికాక్‌‌‌‌ మెరుపులతో ముంబై 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 రన్స్‌‌‌‌ చేసి ఈజీగా గెలిచింది. రోహిత్‌‌‌‌ శర్మ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌‌‌‌తో 35), హార్దిక్‌‌‌‌ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌‌‌తో 21 నాటౌట్‌‌‌‌) కూడా రాణించారు.

ఈ విజయం చాలా స్పెషల్.. టైటిల్ గెలిచే కాన్ఫిడెన్స్ వచ్చింది: రోహిత్ శర్మ

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 17, 2020, 15:02 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X