న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు కివీస్ ప్లేయర్లు వెక్కివెక్కి ఏడ్చారు: పాక్ మాజీ క్రికెటర్

Inzamam-ul-Haq Says NZ players were crying in swimming pool

న్యూఢిల్లీ: ఉగ్రదాడుల భయంతో పాకిస్థాన్‌లో పర్యటించాలంటే అనేక దేశాల క్రికెట్ జట్లు భయపడుతుంటాయి. 2009లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై జరిగిన దాడితో మరే విదేశీ జట్టు కూడా పాకిస్థాన్ ‌టూర్ అంటే ససేమిరా అనే పరిస్థితి వచ్చింది. అంతకుముందు 2002లో కూడా పాక్ లో ఉగ్రదాడి జరిగింది. ఆనాటి సంఘటనలను ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివరించాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. 2002 సమ్మర్ తీపి, చేదు జ్ఞాపకమన్నాడు.

 ఓవైపు ట్రిపుల్ సెంచరీ ఆనందం..

ఓవైపు ట్రిపుల్ సెంచరీ ఆనందం..

నాడు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో తాను ట్రిపుల్ సెంచరీతో(321) అత్యధిక స్కోర్ చేశాడు. బౌలింగ్ లో షోయబ్ అక్తర్ విజృంభించడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైందన్నాడు. రెండో టెస్టు కరాచీలో జరగాల్సి ఉండగా, ఉదయం పూట హోటల్ లో భారీ బాంబు పేలుడు జరిగిందని ఇంజమామ్ చెప్పాడు. ఈ ఘటనతో ట్రిపుల్ సెంచరీ ఆనందం ఆవిరైందన్నాడు.

 ప్రాక్టీస్ వెళ్లడంతో బతికిపోయా..

ప్రాక్టీస్ వెళ్లడంతో బతికిపోయా..

ఆ సమయంలో తాను ప్రాక్టీసుకు వెళ్లడంతో బతికిపోయానని, తాను బస చేసిన గది కూడా పాక్షికంగా ధ్వంసమైందన్నాడు. ప్రాక్టీసు ముగించుకుని స్టేడియం నుంచి హోటల్ కు వెళ్లిన తనను వెంటనే కింది ఫ్లోర్ కు వెళ్లాలని సూచించారన్నాడు.‘ఈ బ్లాస్ట్ వల్ల రెండు జట్ల ప్లేయర్లలో ఎవ్వరూ గాయపడలేదు. కానీ అంతా భయపడ్డారు. బ్లాస్ట్ జరిగిన వైపే నా గది ఉంది. పేలుడు ధాటికి కిటికీ అద్దాలన్నీ ధ్వంసమై అపోజిట్ సైడ్‌లో ఉన్న గోడకు తగిలాయి. అదృష్టవశాత్తూ ఆ టైమ్‌లో నేను రూమ్‌లో లేను.'అని తెలిపాడు.

పెద్ద శబ్ధం వినిపించింది..

పెద్ద శబ్ధం వినిపించింది..

‘ప్రాక్టీస్ కోసం మేం గ్రౌండ్‌కు బయల్దేరబోతున్న సమయంలో పెద్ద శబ్ధం వినిపించింది. కానీ, ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. హోటల్లోని అన్ని కర్టెన్స్ కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఏమైందని ఓ గార్డును అడిగితే.. బయట బాంబ్ బ్లాస్ట్ జరిగిందని చెప్పాడు. అక్కడున్న సిబ్బంది సూచనతో నేను ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లాను.'అన్నాడు.

భయంతో కివీస్ ప్లేయర్లు

భయంతో కివీస్ ప్లేయర్లు

తాను స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లేసరికి అక్కడ న్యూజిలాండ్ ఆటగాళ్లు విలపిస్తూ కనిపించారని ఈ పాక్ మాజీ కెప్టెన్ వెల్లడించాడు. వారు ఎప్పుడూ ఇలాంటి భయంకర అనుభవాన్ని చవిచూసి ఉండరని, బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లిన ఆటగాళ్లు బాంబు భయంతో వణికిపోయారని నాటి సంగతులను ఇంజమామ్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ సిరీస్ ను మధ్యలోనే ముగించుకుని కివీస్ జట్టు స్వదేశం వెళ్లిపోయిందని తెలిపాడు. ‘ఆ టైమ్‌లో కివీస్ ప్లేయర్లు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నారు. అందరూ ఏడుస్తూ కనిపించారు. కివీస్ వెంటనే తమ స్వదేశానికి వెళ్లిపోయింది. కానీ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మా జట్టు ఆటగాళ్లకు వారం పట్టింది.'అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.కాగా, నాడు జరిగింది ఆత్మాహుతి దాడి కాగా, ఆ దాడిలో 11 మంది ఫ్రెంచ్ ఇంజినీర్లు, ఇద్దరు పాకిస్థాన్ పౌరులు సహా ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా మరణించాడు.

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

Story first published: Saturday, May 9, 2020, 10:49 [IST]
Other articles published on May 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X