న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లీసా స్టాలేకర్ క్రికెట్ జర్నీ.. పుణె అనాథాశ్రమం నుంచి ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' దాకా.!

 Inspiring Lisa Sthalekars Journey From An Orphanage To ICC Hall Of Fame

న్యూఢిల్లీ: లీసా స్టాలేకర్.. ఓ క్రికెట్ ఎక్స్‌పర్ట్‌గా.. కామెంటేటర్‌గా ఆమె పేరు తరుచూ వింటుంటాం.! కానీ ఆమె స్థాయి అంతకంటే గొప్పది.! ఆస్ట్రేలియా మహిళల మాజీ కెప్టెన్.! నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్.! తాజాగా ఐసీసీ హాల్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొమ్మిదో మహిళా క్రికెటర్.! అయితే ఆమె జీవిత ప్రయాణం మొదలైంది మాత్రం భారత్‌లోనే.! అవును ఆమె భారత సంతతికి చెందిన ప్లేయరే.! ఈ ఏడాది సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్‌తో కలిసి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న లీసా జీవిత ప్రయాణం.. చాలా ఆసక్తికరం.. స్పూర్తిదాయకం.!

అనాథాశ్రమంలో పుట్టి..

అనాథాశ్రమంలో పుట్టి..

cricket.com.au వివరాల ప్రకారం లిసాస్టాలేకర్ 1978, ఆగస్టు 13న మహారాష్ట్రలోని పుణెలో జన్మించింది. అయితే ఆమెను పోషించలేని తల్లిదండ్రులు పసితనంలోనే శ్రీవత్స అనాథశ్రమం ముందు వదిలేశారు. ఆ పాపను ఆశ్రమం నిర్వాహకులు అల్లారుముద్దుగా చూసుకున్నారు.. లైలా అనే పేరు పెట్టారు. ఆమెకు మూడు వారాల వయసు ఉన్న సమయంలోనే మిచిగాన్‌కు చెందిన హారెన్, సుయ్ స్టాలేకర్ దంపతులు దత్తత తీసుకుని అమెరికాకు వెళ్లిపోయారు. ముంబైలో పుట్టి పెరిగిన హారెన్ స్టాలేకర్‌కు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం కావడంతో.. లీసాని క్రికెటర్‌ను చేయాలని ఆశించాడు.

నా రక్తంలోనే క్రికెట్..

నా రక్తంలోనే క్రికెట్..

"నేను భారత్‌లోని పుణెలో పుట్టాను. అక్కడ నన్ను దత్తత తీసుకున్నారు. తర్వాత రెండేళ్లు అమెరికాలో ఉన్నాను. అనంతరం రెండేళ్లు కెన్యాలో, చివరికి ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడ్డాం. మా నాన్న భారతీయుడు, మా అమ్మ ఇంగ్లిష్" అని లీసా స్టాలేకర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ‘భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. నా రక్తంలో కూడా అది ఉందని నాకు కచ్చితంగా అనిపిస్తుంది'అని చెప్పింది.

తండ్రి పర్యవేక్షణలో..

తండ్రి పర్యవేక్షణలో..

తొలుత ఇంటి వెనకాల ఉన్న చిన్నపాటి స్థలంలో లీసాకు ఆమె తండ్రి క్రికెట్‌లో మెళకువలు నేర్పాడు.. ఆ తర్వాత ఇంటిదగ్గరే ఉన్న మైదానంలో శిక్షణ తీసుకుంది.. అబ్బాయిలతో కలిసి ఆడింది.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు క్రికెట్‌లో రాటుదేలింది.. ఆమె ప్రతిభను గమనించి న్యూ సౌత్‌వేల్స్‌ క్లబ్‌ ఆమెను సాదరంగా ఆహ్వానించింది. ఇక అప్పట్నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కమ్ రైటైహ్యాండ్ బ్యాటర్ అయిన లీసా.. 2001లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది.

 నాలుగు ప్రపంచకప్‌లు..

నాలుగు ప్రపంచకప్‌లు..

సుదీర్ఘమైన క్రికెట్‌ కెరీర్‌లో లీసా నాలుగు ప్రపంచకప్‌లు ఆడింది. ఎనిమిది టెస్ట్‌ల్లో 416 పరుగులు చేయడంతో పాటు 23 వికెట్లను తీసుకుంది. 125 వన్డేల్లో 2,728 రన్స్‌తో పాటు 146 వికెట్లు తీసింది. 54 టీ 20 మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేయడంతో పాటు , 60 వికెట్లు తీసుకుంది. వన్డేల్లో బ్యాటర్‌గా 1,000 పరుగులు చేయడంతో పాటు వంద వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఇక భారత్ వేదికగా జరిగిన 2013 వన్డే ప్రపంచకప్‌లో లీసా అద్భుత క్యాచ్‌తో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఆమె రెండు కీలక వికెట్లు తీసింది. చిరస్మరణీయంగా నిలిచిపోయే అదే మ్యాచ్‌తోనే ఆమె తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం క్రికెట్‌ వ్యాఖ్యతగా, టీమ్ కోచ్, క్రికెట్ అసోషియేషన్‌ మెంబర్‌గా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

రోహిత్ కెప్టెన్సీ‌లో అదే ప్రత్యేకం.. దుబాయ్‌లో మా చెత్త రికార్డును చెరిపేస్తాం: జహీర్ ఖాన్

Story first published: Thursday, August 27, 2020, 17:58 [IST]
Other articles published on Aug 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X