రోహిత్ కెప్టెన్సీలో అదే ప్రత్యేకం.. దుబాయ్‌లో మా చెత్త రికార్డును చెరిపేస్తాం: జహీర్ ఖాన్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మవిజయవంతమవ్వడానికి చాలా కారణాలున్నాయని, అన్నిటికన్నా ముఖ్యమైంది. మాత్రం అతడు ప్రశాంతంగా ఉండటమేనని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్‌ఖాన్ అన్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన జహీర్ ఖాన్.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని రోహిత్ కెప్టెన్సీలో అత్యుత్తమమైన లక్షణం ఏమిటని ప్రశ్నించాడు. దానికి ఈ మాజీ పేసర్ స్పందిస్తూ.. ఆ జాబితా చాలా పెద్దదన్నాడు.

అదే రోహిత్ ప్లస్ పాయింట్..
‘ఒక కెప్టెన్‌గా రోహిత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది మాత్రం తన చుట్టూ ఉండే పరిస్థితుల్ని ప్రశాంతంగా మల్చుకోవడమే. అదే సమయంలో రోహిత్ ఆట గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తాడు. ఒత్తిడి సమయాల్లోనూ అతడు తీసుకునే నిర్ణయాలపై జట్టు సభ్యులు నమ్మకం ఉంచుతారు. అది జట్టులోని ప్రతీ ఆటగాడి నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఉపయోగపడింది.'అని జహీర్ చెప్పుకొచ్చాడు.

చెత్త రికార్డును చెరిపేస్తాం..
ఇక ముంబై ఇండియన్స్‌కు దుబాయ్‌లో గొప్ప రికార్డు లేదు. గతంలో భారత్‌లో ఎన్నికల సందర్భంగా లీగ్ అక్కడ జరగ్గా ముంబై దారుణంగా విఫలమైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ అభిమాని జహీర్‌ను ప్రశ్నించాడు. ‘గతంలో ఇక్కడ ఆడినప్పుడు ముంబై ఇండియన్స్ ప్రారంభంలోనే తడబడింది. ఈ విషయాలు మీకు గుర్తున్నాయా? అన్నాడు.
దీనికి జహీర్ ‘గతంలో ఇక్కడ ఆడిన అనుభవాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అది నిజమే, యూఏఈలో ఇది వరకు ఆడినప్పుడు కొన్ని ఓటములు చవిచూశాం. కానీ, మేం దాన్ని సవాలుగా స్వీకరించి ముందుకెళ్లాం. ఏ జట్టుకైనా ఇటువంటి పరిస్థితులు మంచి చేస్తాయి. కాబట్టి, ఇప్పుడు కూడా అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గత రికార్డును తిరగ రాస్తామనే నమ్మకం ఉంది.'అని తెలిపాడు.

పరిస్థితులును అర్థం చేసుకోవాలి..
‘భారత్‌లోని పరిస్థితులను బట్టే ఐపీఎల్‌లో ఆటగాళ్లను తీసుకుంటారు కదా. ఇప్పుడు వేదిక మారింది. ఎలా?'అని మరొక అభిమాని ప్రశ్నించగా.. ‘నిజమే. ఇక్కడి పరిస్థితులను బట్టే ఆటగాళ్లను ఎంచుకుంటారు. అయితే, సహజంగా జట్లు అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లనే ఎంపిక చేస్తాయి. ఇక ముంబై విషయానికి వస్తే.. అన్ని కోణాల్లో ఆలోచించే ఆటగాళ్లను ఎంపిక చేశాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడే ఆటగాళ్లు మాకున్నారు. అయితే, అక్కడి పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం'అని జహీర్ సమాధానమిచ్చాడు.

అందుకే ట్రెంట్ బౌల్ట్‌ను తీసుకొచ్చాం..
ఈ సీజన్‌కు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్‌బౌల్ట్‌ను తీసుకోవడంపై ప్రశ్నించగా... అతనో అద్భుతమైన బౌలరని, ప్రారంభంలో వికెట్లు తీసి జట్టుకు లాభం చేకూరుస్తాడని ఆశిస్తున్నామని తెలిపాడు. ప్రపంచ స్థాయి పేసర్ అయిన బౌల్ట్.. రికార్డు కూడా అమోఘంగా ఉందన్నాడు. అతడి రాక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. కరోనా కఠిన పరిస్థితుల్లో ఆడటమనేది నిజంగా కష్టతరమేనని మరో అభిమాని ప్రశ్నంగా సమాధానంగా తెలిపాడు.
కంగ్రాట్స్ కాక.. విరాట్ కోహ్లీ-అనుష్క జోడీకి క్రిస్ గేల్ విషెస్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications