న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్ టెస్టు రికార్డుపై కన్నేసిన కోహ్లీ: ధోని కెప్టెన్సీ రికార్డు బద్దలయ్యేనా?

India Vs West Indies: Virat Kohli looks to surpass MS Dhoni, Ricky Pontings captaincy records in Test

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని చేరువయ్యాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీని సాధిస్తే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ రికీ పాంటింగ్‌(19) సమం చేస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 18 సెంచరీలతో పాంటింగ్‌ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్‌(25) తొలి స్థానంలో ఉన్నాడు.

<strong>యాషెస్ సిరిస్ వల్లే: గంగూలీ అభిప్రాయానికి మద్దతు పలికిన భజ్జీ </strong>యాషెస్ సిరిస్ వల్లే: గంగూలీ అభిప్రాయానికి మద్దతు పలికిన భజ్జీ

కెప్టెన్‌గా 18 సెంచరీలు

కెప్టెన్‌గా 18 సెంచరీలు

ఇక, కోహ్లీ విషయానికి వస్తే టెస్టుల్లో మొత్తం 25 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో కెప్టెన్‌గా 18 సెంచరీ సాధించాడు. ఇక విండిస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొడతాడు. కోహ్లీ 46 టెస్టులకు కెప్టెన్సీ వహించగా 26 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.

ధోని రికార్డు బద్దలయ్యేనా?

ధోని రికార్డు బద్దలయ్యేనా?

ఇక, ధోని కెప్టెన్సీలో 60 టెస్టుల్లో 27 విజయాలు నమోదు చేసింది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన.... అనంతరం జరిగిన వన్డే సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... మిగిలిన రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట: జీవితకాల నిషేధం ఎత్తివేత

ఒక దశాబ్దంలో 20,000 పరుగులు

ఒక దశాబ్దంలో 20,000 పరుగులు

మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 234 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఒక దశాబ్దంలో 20,000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు విండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఎంతపని చేశావ్ జోఫ్రా ఆర్చర్! మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరం

విండిస్ పర్యటనతో టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభం

విండిస్ పర్యటనతో టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభం

ఐసీసీ ప్రతిషాత్మకంగా ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా వెస్టిండిస్‌ పర్యటనతో ప్రారంభించనుంది. టెస్టు చాంపియన్‌షిఫ్‌లో భాగంగా ఇకపై టీమిండియా ప్రతి టెస్టు ఎంతో కీలకం. టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా 2021 జూన్‌ వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లార్డ్స్ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడతాయి.

Story first published: Tuesday, August 20, 2019, 18:59 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X