న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట: జీవితకాల నిషేధం ఎత్తివేత

BCCI Reduces Sreesanth's Prohibition Period To 7 Years; Which Will End Up By August 2020
Sreesanths ban reduced to seven years; to end in August 2020

హైదరాబాద్: టీమిండియా పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్‌ అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా ఉత్తర్వులతో ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీశాంత్‌పై నిషేధం 2020 ఆగస్టులో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీశాంత్ మళ్లీ క్రికెట్‌ ఆడొచ్చు. ఈ సందర్భంగా డీకే జైన్‌ తన ఉత్తర్వుల్లో "శ్రీశాంత్‌ నలభై ఏళ్లకు చేరువ అవుతున్నాడు. క్రికెటర్‌గా అత్యుత్తమ దశను దాటేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌గా అతడి కెరీర్‌ దాదాపు ముగిసినట్టే" అని పేర్కొన్నాడు.

<strong>ప్రో కబడ్డీ: చెన్నై అంచె ఫస్టాఫ్ తర్వాత... రైడ్, ట్యాకిల్ పాయింట్లలో అగ్రస్థానం వీరిదే!</strong>ప్రో కబడ్డీ: చెన్నై అంచె ఫస్టాఫ్ తర్వాత... రైడ్, ట్యాకిల్ పాయింట్లలో అగ్రస్థానం వీరిదే!

నిషేధ కాలంలో శ్రీశాంత్‌

నిషేధ కాలంలో శ్రీశాంత్‌

"నిషేధ కాలంలో శ్రీశాంత్‌ ఎటువంటి క్రికెట్‌ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాంతో పాటు బీసీసీఐ కార్యక్రమాలకు సైతం కూడా దూరంగా ఉన్నాడు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత 13.09.2013 నుంచి ఏడేళ్ల వరకే అతడిపై నిషేధం అమలవుతుంది. బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ శిక్ష విధించిన నాటి నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది" అని డీకే జైన్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

కెరీర్‌లో అత్యున్నత దశలో

కెరీర్‌లో అత్యున్నత దశలో

తన కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్న సమయంలో శ్రీశాంత్‌ నిషేధానికి గురయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో అతడిపై 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తనను అన్యాయంగా ఈ ఫిక్సింగ్‌‌లో ఇరికించారని, తనపై విధించిన నిషేధం ఎత్తివేయాలని న్యాయ పోరాటానికి దిగాడు.

'ఆర్చర్‌ ఇంగ్లండ్‌కు గొప్ప ఆయుధం.. అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి'

నిషేధం తొలగించి శిక్ష తగ్గించే

నిషేధం తొలగించి శిక్ష తగ్గించే

ఈ విషయంలో కేరళ హైకోర్టులో శ్రీశాంత్‌కు ఊరట లభించినా బీసీసీఐ మళ్లీ అతడిపై పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న సుప్రీం కోర్టు అతడిపై నిషేధం తొలగించి శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది.

'డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఆర్చర్ బౌలింగ్‌ చూడటం చాలా భయంగా ఉంటుంది'

తీర్పు వెల్లడించిన డీకే జైన్

తీర్పు వెల్లడించిన డీకే జైన్

దీంతో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఈ మేరకు తన తీర్పు వెల్లడించారు. తనపై ఉన్న నిషేధం తగ్గడంతో శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. కాగా, టీమిండియా తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడి 169 వికెట్లు తీశాడు. 2011లో టీమిండియా వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో శ్రీశాంత్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.

Story first published: Tuesday, August 20, 2019, 17:57 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X