Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంతపని చేశావ్ జోఫ్రా ఆర్చర్! మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరం

Ashes 2019: Steve Smith ruled out of Headingley Test following concussion

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌‍లో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ మేరకు ఆ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అధికారిక ప్రకటన చేశాడు. లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకడంతో స్మిత్ మైదానంలో కుప్పకూలాడు.

రిటైర్డ్‌హర్ట్‌గా స్టీవ్ స్మిత్

రిటైర్డ్‌హర్ట్‌గా స్టీవ్ స్మిత్

ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం 40 నిమిషాల తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. బంతి బలంగా మెడను తాకడంతో నొప్పితో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కూడా దిగలేదు.

కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌

కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌

ఒక క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసింది. ఐసీసీ ఈ కొత్త నిబంధనల మేరకు ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా అందుకు మ్యాచ్ రిఫరీ అంగీకరించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ కింద మార్నస్‌ లాబుస్చాగ్నే బరిలోకి దిగాడు.

స్మిత్ స్థానంలో మార్నస్‌ లాబుస్చాగ్నే

స్మిత్ స్థానంలో మార్నస్‌ లాబుస్చాగ్నే

ఈ నేపథ్యంలో మూడో టెస్టులో సైతం స్టీవ్ స్మిత్ స్థానంలో మార్నస్‌ లాబుస్చాగ్నే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు హెడెంగ్లే వేదికగా గురువారం నుంచి ఆరంభం కానుంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది.

ఈ సిరిస్‌లో టాప్‌ స్కోరర్‌గా స్మిత్

ఈ సిరిస్‌లో టాప్‌ స్కోరర్‌గా స్మిత్

కాగా, యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలతో చెలరేగిన స్మిత్... రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని స్మిత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరం కావడం ఇంగ్లాండ్‌కు లాభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Tuesday, August 20, 2019, 18:08 [IST]
Other articles published on Aug 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+