న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో అరుదైన రికార్డుకి చేరువలో శిఖర్ ధావన్!

Shikhar Dhawan On The Edge Of Joining Three Indian Stalwarts In Elite T20 || Oneindia Telugu
India vs West Indies: Shikhar Dhawan on the verge of joining three Indian stalwarts in elite T20 list

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా టీమిండియా మంగళవారం ఆఖరి టీ20లో వెస్టిండిస్‌తో తలపడనుంది. గత ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 22 పరుగులు తేడాతో విజయం సాధించింది.

తద్వారా మూడు టీ20ల సిరిస్‌ను మరో టీ20 మిగిలుండగానే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుయానా వేదికగా జరగనున్న మూడో టీ20లో టీమిండియా ప్రయోగాల బాట పట్టనుంది. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు.

<strong>యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్</strong>యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

మరో 47 పరుగులు చేస్తే

మరో 47 పరుగులు చేస్తే

ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మరో 47 పరుగులు చేస్తే టీ20ల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్ ఇప్పటివరకు 1334 పరుగులు చేయగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 4579 పరుగులు సాధించాడు. ధావన్‌కు ముందు కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు.

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీరీల హక్కులు, పీవోకేపై అఫ్రిదికి గంభీర్ గట్టి కౌంటర్

టీ20ల్లో ఏడువేల మైలురాయిని

టీ20ల్లో ఏడువేల మైలురాయిని

ఈ మ్యాచ్‌లో గనుక ధావన్ మరో 47 పరుగులు చేస్తే టీ20ల్లో ఏడువేల మైలురాయిని అందుకున్న 15వ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇదిలా ఉంటే, వెస్టిండిస్ పర్యటనలో ధావన్ ప్రదర్శన నిరాశపరుస్తోంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన తొలి టీ20లో ఒక పరుగు మాత్రమే చేసిన ధావన్... రెండో టీ20లో 23 పరుగులు చేశాడు.

గుయానా వేదికగా మూడో టీ20

గుయానా వేదికగా మూడో టీ20

మూడో టీ20 గుయానా వేదికగా జరగనున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడేమో చూడాలి మరి. మూడు టీ20ల సిరిస్ అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టీ20ల్లో 7000కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లు వీరే:

యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

టీ20ల్లో 7000కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లు

టీ20ల్లో 7000కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లు

8416: విరాట్ కోహ్లీ

8392: సురేశ్ రైనా

8291: రోహిత్ శర్మ

6953: శిఖర్ ధావన్

6621: ధోని

Story first published: Tuesday, August 6, 2019, 16:18 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X