న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీరీల హక్కులు, పీవోకేపై అఫ్రిదికి గంభీర్ గట్టి కౌంటర్

Gautam Gambhir Trolls Shahid Afridi Over Kashmir || Oneindia Telugu
Gautam Gambhir says Afridi ‘spot on’, all crimes against humanity taking place in PoK

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దుపై భారత ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్‌లో వెళ్లగక్కాడు.

కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని... ఆర్టికల్ 370 రద్దు జరుగుతుంటే ఐక్యరాజ్యసమితి నిద్రపోతుందా అని ప్రశ్నించాడు. మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీరీలపై బలవంతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించాడు. ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశాడు.

<strong>యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం</strong>యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు

"‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐక్యరాజ్య సమితిని ఎందుకు ఏర్పాటు చేశారు? కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి" అంటూ అఫ్రిది తన ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.

అఫ్రిది ట్విట్టర్ వ్యాఖ్యలపై

అఫ్రిది ట్విట్టర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. "అఫ్రిది.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని అంగీకరించిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏంటంటే.. ఇవన్నీ పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం" అంటూ గంభీర్ తనదైన శైలిలో అఫ్రిదికి సమాధానమిచ్చాడు.

ఇలా గొడవపడటం ఇదే మొదటిసారి కాదు

ఇలా గొడవపడటం ఇదే మొదటిసారి కాదు

అయితే, ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు ఇలా గొడవపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కశ్మీర్‌ విషయంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. ఇక, భారత్-పాక్ మ్యాచ్‌లు జరిగిన సందర్భంలో సైతం మైదానంలో కూడా ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన ఘటనలు అనేకం.

ఆర్టికల్ 370 రద్దుపై గౌతమ్ గంభీర్

ఆర్టికల్ 370 రద్దు చేసిన మోడీ ప్రభుత్వంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. ఆర్టికల్ 370 రద్దును కొందరు స్వాగతిస్తుంటే.. మరి కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Story first published: Tuesday, August 6, 2019, 13:48 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X