న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

Sachin Tendulkar lauded Steve Smith on making a remarkable comeback to Test cricket

ముంబై: గతేడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఆరంభపు టెస్టులో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్మిత్ అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రస్తుతం అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్మిత్‌ను పొగిడాడు.

<strong>టీమిండియా కోచ్‌ ఎంపిక.. కపిల్‌ కమిటీదే తుది నిర్ణయం</strong>టీమిండియా కోచ్‌ ఎంపిక.. కపిల్‌ కమిటీదే తుది నిర్ణయం

అద్భుతంగా ఆడావు:

సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విటర్‌ ద్వారా స్టీవ్ స్మిత్, నాథన్‌ లైయన్‌లకు అభినందనలు తెలిపాడు. 'స్మిత్‌ అద్భుతంగా ఆడావు. టెస్టుల్లో క్రికెట్‌లో ఈ విధంగా పునరాగమనం చేయడం బాగుంది. నాథన్‌ లయన్ సూపర్ బౌలింగ్‌ చేశాడు. యాషెస్‌ తొలి టెస్టు గెలిచినందుకు ఆసీస్‌ జట్టుకు అభినందనలు' అని సచిన్ పేర్కొన్నాడు. సచిన్‌తో పాటు టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌, ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు.

మాథ్యూ హేడెన్‌ తర్వాత:

మాథ్యూ హేడెన్‌ తర్వాత:

మొదటి ఇన్నింగ్స్‌లో సహచరులు పెవిలియన్ చేరినా ఒంటరి పోరాటం చేసి సెంచరీ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సూపర్ సెంచరీ (142; 207 బంతుల్లో 14×4) సాధించాడు. దీంతో యాషెస్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఐదో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఇక 2003లో మాథ్యూ హేడెన్‌ తర్వాత యాషెస్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ నిలిచాడు. గతంలో బార్డ్‌స్లే, మోరిస్, స్టీవ్‌ వాలు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు.

టెస్టుల్లో 25 సెంచరీలు:

టెస్టుల్లో 25 సెంచరీలు:

టెస్టుల్లో స్మిత్‌ 25 సెంచరీలు సాధించాడు. ఇక యాషెస్‌లో పదో సెంచరీలు చేసాడు. మరోవైపు వేగంగా 25 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా స్టీవ్‌ (119 ఇన్నింగ్స్‌) నిలిచాడు. ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్‌మన్‌ (66 ఇన్నింగ్స్‌) ముందున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 130 ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు సాధించాడు.

'మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే బహుశా మేము గెలిచే వాళ్లం'

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్ ఆరంభం:

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్ ఆరంభం:

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. స్మిత్, బర్న్ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ చెలరేగడంతో ఆసీస్‌ 487/7 భారీ స్కోర్‌ చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌ ఓవర్‌నైట్‌ స్కోరు 13/0తో సోమవారం ఆటను కొనసాగించగా.. ఆసీస్ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ (6/49), పేసర్‌ పాట్ కమిన్స్‌ (4/32) చెలరేగడంతో 146 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. దీంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్ తొలి విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Tuesday, August 6, 2019, 12:31 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X