న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: లారా రికార్డు బద్దలు, చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

India VS West Indies 2019 : Chris Gayle Surpasses Brian Lara’s Record In Called Off Game In Guyana
India vs West Indies: Chris Gayle surpasses Brian Lara’s record in called off game in Guyana

హైదరాబాద్: వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య గురువారం తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా రద్దైన ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్(4) పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

తద్వారా వెస్టిండిస్ తరపున అత్యధిక వన్డే మ్యాచులు ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు బ్రియాన్ లారా(295) వన్డేలతో వెస్టిండిస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

అయితే, గురువారం నాటి మ్యాచ్‌తో క్రిస్ గేల్ విండీస్ తరపున అత్యధికంగా 296 అంతర్జాతీయ వన్డే మ్యాచులు ఆడి లారా రికార్డుని బద్దలు కొట్టాడు. లారా తర్వాత ఈ జాబితాలో చందర్ పాల్ 268, డెస్మండ్ హేన్స్ 238, వివ్ రిచర్డ్స్ 187 ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

<strong>మా తప్పేమీ లేదు.. పృథ్వీ షా డోపింగ్‌ వివరాలు వెల్లడించిన బీసీసీఐ</strong>మా తప్పేమీ లేదు.. పృథ్వీ షా డోపింగ్‌ వివరాలు వెల్లడించిన బీసీసీఐ

వెస్టిండిస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్లు:

వెస్టిండిస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్లు:

296: Chris Gayle

295: Brian Lara

268: Shivnarine Chanderpaul

238: Desmond Haynes

187: Viv Richards

శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ: 17 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు

గత కొంత కాలంగా క్రిస్ గేల్ ఫామ్ లేమితో

గత కొంత కాలంగా క్రిస్ గేల్ ఫామ్ లేమితో

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా క్రిస్ గేల్ ఫామ్ లేమితో సతమతమవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం క్రిస్ గేల్ నిరాశ పరిచాడు. 39 ఏళ్ళ క్రిస్ గేల్ వెస్టిండిస్ తరుపున వన్డేల్లో 296 మ్యాచ్‌లు, టెస్టుల్లో 103, టీ20ల్లో 58 మ్యాచులు ఆడాడు.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్

కాగా, వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన తొలి వన్డేను తొలుత అంపైర్లు 43 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంఫైర్లు 34 ఓవర్లకు కుదించారు. అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది.

విండీస్‌తో తొలి వన్డే.. మైదానంలోనే కోహ్లీ స్టెప్పులు (వీడియో)

తొలి వన్డే రద్దు

తొలి వన్డే రద్దు

అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి వెస్టిండిస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్(4) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గేల్‌ను కుల్దీప్ ఔట్ చేశాడు. క్రీజులో ఎవిన్‌ లెవిస్‌(40), షైహోప్‌(6) పరుగులతో ఉన్నారు.

Story first published: Friday, August 9, 2019, 14:09 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X