శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ: 17 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు

హైదరాబాద్: వెస్టిండిస్ ఏ జట్టుతో జరుగుతున్న అనధికార మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ శుభమాన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
క్రికెట్‌లో చెత్త విషయం: వర్షం కారణంగా తొలి వన్డే రద్దుపై కోహ్లీ
వెస్టిండిస్ ఏ జట్టుతో జరుగుతున్న అనధికార మూడో టెస్టులో 19 ఏళ్ల శుభమాన్ గిల్ 250 బంతుల్లో 204 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పిన్న వయస్కుడిగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(218) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నెలకొల్పిన డబుల్ సెంచరీ రికార్డుని గిల్ బద్దలు కొట్టాడు.
2002లో జింబాబ్వే జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తరుపున ఆడిన గంభీర్ ఈ రికార్డుని నమోదు చేశాడు. అప్పుడు గంభీర్ వయసు 20 ఏళ్లు. ఓవర్ నైట్ స్కోరు 23/4తో క్రీజులోకి వచ్చిన శుభమాన్ గిల్(204 నాటౌట్) లంచ్ విరామానికి ముందు సెంచరీ సాధించాడు.

ఐదో వికెట్‌కు 315 పరుగుల భాగస్వామ్యం
మరో ఓవర్‌నైట్ ఆటగాడు నదీమ్(13) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హనుమ విహారి(118 నాటౌట్) శుభమాన్ గిల్‌కు చక్కటి మద్దతివ్వడంతో ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. టీమిండియా టాపార్డర్ విఫలమైనప్పటికీ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 315 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ట్యాక్స్ వార్: బీసీసీఐ వార్షిక ఆదాయంలో కోతకు ఐసీసీ సిద్ధం!

డబుల్ సెంచరీ సాధించిన అనంతరం
శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ సాధించిన అనంతరం ఇండియా ఏ తన ఇన్నింగ్స్‌ను 365/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 373 పరుగుల చేధనకు దిగిన వెస్టిండిస్ ఏ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. మరో రోజు ఆట మిగిలుంది.

తొలి ఇన్నింగ్స్‌లో శుభమాన్ గిల్ డకౌట్
తొలి ఇన్నింగ్స్‌లో శుభమాన్ గిల్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు. గిల్ 250 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో డబుల్ సెంచరీ సాధించాడు. స్ట్రయిక్ రేట్ 82..25గా నమోదైంది. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ హనుమ విహారి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిశాడు.
గ్లోబల్ టీ20 కెనడా లీగ్.. నిరసన తెలిపిన యువరాజ్ సింగ్

ఇప్పటికే టెస్టు సిరిస్‌ను గెలిచిన ఇండియా ఏ
అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఏ జట్టు 201 పరుగులకే కుప్పకూలగా... వెస్టిండిస్ ఏ జట్టు 194 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇండియా ఏ జట్టు మూడో టెస్టు విజయంపై కూడా కన్నేసింది.
సంక్షిప్త స్కోర్లు:
ఇండియా ఏ: 201 and 365/4డిక్లేర్డ్ in 90 overs (గిల్ 204 not out, విహారి 118 not out, హోల్డర్ 2/88)
వెస్టిండిస్ ఏ: 194 and 37/0 in 15 overs (జెరెమీ సోలోజానో 20 బ్యాటింగ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications