న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లారా సూచన.. విండీస్ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి!!

India vs West Indies: Brian Lara focused on sharpening West Indies players mental approach

ఆంటిగ్వా: ఇండియాతో తలపడే వెస్టిండీస్ జట్టు శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ.. మానసికంగా దృఢంగా ఉండాలని ఆ దేశ మాజీ ఆటగాడు, దిగ్గజం బ్రియాన్ లారా సూచించాడు. సొంత గడ్డపై టీమిండియాతో జరిగిన పర్యటనలో వెస్టిండీస్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కనీసం టెస్ట్ సిరీస్‌ను అయినా సొంతం చేసుకోవాలని విండీస్ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.

పాకిస్థాన్‌ జట్టు కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా 'మిస్బా ఉల్‌ హక్‌'!!?

తొలి టెస్టు ఆడబోతున్న విండీస్ జట్టుకు బ్రియాన్ లారా, రామ్ నరేష్ సర్వాన్ పలు సూచనలు చేశారు. 'విండీస్ జట్టు శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ.. మానసికంగా దృఢంగా ఉండాలి. ముఖ్యంగా యువ ఆటగాళ్లుకు ఇది ఉపయోగపడుతుంది. టీమిండియా ప్రపంచంలోనే అత్యున్నత టెస్టు జట్టు. కాబట్టి విండీస్ జట్టు మానసికంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలి' అని లారా సూచించారు. ప్రస్తుతం విండీస్ జట్టులో ఎక్కువ యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అందుకే శిబిరంలో చేరా అని లారా పేర్కొన్నాడు.

సొంత గడపై ఇంగ్లాండ్‌పై సిరీస్ గెలవడం మాకు ఉపయోగపడుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మొదటగా సొంతగడ్డపై పునాది నిర్మించుకోవాలి. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాం అని లారా తెలిపాడు. విండీస్ తరఫున 131టెస్టు మ్యాచులాడిన లారా.. 10 వేలకు పైగా పరుగులు చేశాడు. లారా విండీస్‌కు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ ఏడాది ప్రారంభంలో సొంత గడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విండీస్ 2-1తో గెలుచుకుంది.

రేపే ఫలితాలు: ఇంటర్వ్యూలకు హాజరైన బంగర్‌, శ్రీధర్‌, అరుణ్‌, జాంటీ రోడ్స్‌

మరోవైపు ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తే వెస్టిండీస్‌లో రెండు టెస్ట్ సిరీస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలవనున్నాడు. అంతేకాకుండా ప్రస్తుత పర్యటనలో 17 ఏళ్ల భారత అజేయ రికార్డును కూడా కొనసాగించాలని కోహ్లీ చూస్తున్నాడు. భారత్ 2002 నుండి వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లను కోల్పోలేదు. 17 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును అలానే కొనసాగించాలని కోహ్లీ ఆరాటపడుతున్నాడు.

Story first published: Wednesday, August 21, 2019, 16:03 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X