న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌ జట్టు కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా 'మిస్బా ఉల్‌ హక్‌'!!?

Pakistan Cricket Board keen on appointing Misbah-ul-Haq as Pakistans coach and chief selector

కరాచి: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మాజీ కెప్టెన్ మిస్బా ఉల్‌ హక్‌ను పాక్‌ జట్టు కోచ్‌గా‌, చీఫ్‌ సెలక్టర్‌గా నియమించడానికి ఆసక్తి చూపుతోందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం లాహోర్‌లో ప్రీ సీజన్‌ కండిషనింగ్‌ క్యాంప్‌లో ఉన్న మిస్బా.. ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదట. మరోవైపు హెడ్ ​​కోచ్ పదవికి ఇంకా మిస్బా ఉల్‌ హక్‌ దరఖాస్తు చేయలేదు. ఈ పదవికి దరఖాస్తు చివరి గడువు ఆగస్టు 23 వరకు ఉంది. ఇంకా రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మిస్బా దరఖాస్తు చేసే అవకాశం ఉంది.

<strong>10వ స్థానంలో తెలుగు టైటాన్స్.. ఇప్పటికైనా పుంజుకునేనా?</strong>10వ స్థానంలో తెలుగు టైటాన్స్.. ఇప్పటికైనా పుంజుకునేనా?

మిస్బాను ఒప్పించిన జాకీర్‌:

మిస్బాను ఒప్పించిన జాకీర్‌:

తాజాగా పీసీబీకి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ... 'ప్రీ సీజన్‌ కండిషనింగ్‌ క్యాంప్‌ను పర్యవేక్షించడాని మొదటగా మిస్బా అంత ఆసక్తి కనబరచలేదు. అయితే పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డులో క్రియాశీలకంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్‌ డైరెక్టర్‌ జాకీర్‌ ఖాన్‌ మిస్బాను ఒప్పించాడు. పాక్ జట్టులో కొందరు ఫిటెనెస్‌ సమస్యలను ఎదుర్కొంటున్నారని మిస్బాకు తెలుసు' అని చెప్పాడు.

అసంతృప్తిలో మిస్బా

అసంతృప్తిలో మిస్బా

'పాక్ ఆటగాళ్లు ఫఖర్ జమాన్, బాబర్ ఆజాం లాంటి వారిని లీగ్‌ల్లో ఆడటానికి అనుమతించే బదులుగా.. ఫిటెనెస్‌పై దృష్టి సారిస్తే మంచిదని మిస్బా అభిప్రాయపడుతున్నాడు.లీగ్‌ల్లో ఆడటానికి పీసీబీ పాక్ క్రికెటర్లకు అనుమతిచ్చినందుకు అతను అసంతృప్తిగా ఉన్నాడు' అని ఆ అధికారి చెప్పుకొచ్చాడు. పాక్‌ జట్టుకు హెడ్ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ పదవీకాలం ముగియడంతో నూతన కోచ్‌ పదవికీ పీసీబీ దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే.

రేపే ఫలితాలు: ఇంటర్వ్యూలకు హాజరైన బంగర్‌, శ్రీధర్‌, అరుణ్‌, జాంటీ రోడ్స్

 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు:

2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు:

మిస్బా ఉల్‌ హక్‌ పాకిస్థాన్‌ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. మిస్బా సారథ్యంలోనే పాకిస్థాన్‌ టెస్టుల్లో తొలిసారి మొదటి స్థానంకు చేరుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనలో మిస్బా చివరి వరకు పోరాడిన విషయం తెలిసిందే. పాక్‌ తరఫున మిస్బా 76 టెస్టులు (5222), 162 వన్డేలు (5122), 39 టీ20 (788)లు ఆడాడు. 2015లో వన్డేలకు గుడ్‌బై చెప్పిన మిస్బా.. ఇక 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Wednesday, August 21, 2019, 14:06 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X