For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రేపే ఫలితాలు: ఇంటర్వ్యూలకు హాజరైన బంగర్‌, శ్రీధర్‌, అరుణ్‌, జాంటీ రోడ్స్‌

India support staff appeared for interviews via Skype, results may be released tomorrow

ముంబై: కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించగా.. సహాయక సిబ్బంది నియామక ప్రక్రియను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను ప్రసాద్‌ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యాయి.

ఫలితాలు రేపే:

ఫలితాలు రేపే:

మంగళవారం సెలక్షన్‌ కమిటీ 16 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. టీమిండియాకు ప్రస్తుతం సహాయ కోచ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌ మంగళవారం స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. సోమవారం 18 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. గురువారం వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగనుంది. అయితే అదే రోజు ప్రసాద్ కమిటీ ఫలితాలను వెల్లడిస్తారని సమాచారం తెలుస్తోంది.

అరుణ్‌ వైపే మొగ్గు:

అరుణ్‌ వైపే మొగ్గు:

ప్రస్తుత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తిరిగి ఎంపికవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి సైతం అరుణ్‌పై మొగ్గుచూపుతున్నాడట. అరుణ్ నేతృత్వంలో టీమిండియా బౌలింగ్ చాలా మెరుగైంది. ముఖ్యంగా పేస్ విభాగంలో మరింత బలోపేతమైంది. బుమ్రా, భువీ, షమీ, కుల్దీప్, చహల్ రాణిస్తున్నారు. మరోవైపు యువ ఆటగాళ్లు కూడా జట్టులోకి వస్తున్నారు. దీంతో అరుణ్ పదవి పదిలంగానే ఉండనుంది. అయితే బౌలింగ్‌ కోచ్‌ పదవి కోసం వెంకటేశ్‌ ప్రసాద్‌, పారస్‌ మాంబ్రే, అమిత్‌ భండారీలు పోటీ పడుతున్నారు.

జాంటీ రోడ్స్‌ కూడా:

జాంటీ రోడ్స్‌ కూడా:

ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్.శ్రీధర్ కూడా దాదాపు ఎంపిక కావొచ్చు. ఇతని పర్యవేక్షణలో భారత జట్టు ఫీల్డింగ్ గత కొంత కాలంగా ఉన్నత ప్రమాణాలతో ఉంది. ఆటగాళ్లు మెరుపు ఫీల్డింగ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే కమిటీ శ్రీధర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే జాంటీ రోడ్స్‌, జులియన్‌ ఫౌంటెన్‌ కూడా దరఖాస్తు చేయడంతో తీవ్ర పోటీ నెలకొంది.

10వ స్థానంలో తెలుగు టైటాన్స్.. ఇప్పటికైనా పుంజుకునేనా?

బంగర్‌కు తీవ్ర పోటీ

బంగర్‌కు తీవ్ర పోటీ

ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో పోటీలో చాలా మంది ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్‌ అవకాశం దక్కని లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ కూడా రేసులో నిలిచాడు. మరోవైపు విక్రమ్‌ రాఠోడ్‌, ప్రవీణ్‌ ఆమ్రే నుంచి కూడా బంగర్‌కు తీవ్ర పోటీ నెలకొంది. ఈ పరిస్థితులలో బంగర్‌కు మళ్లీ అవకాశం దక్కడం కష్టమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Wednesday, August 21, 2019, 13:28 [IST]
Other articles published on Aug 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+