న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గవర్నమెంట్ ఆర్డర్.. ప్రేక్షకుల్లేకుండానే భారత్-సౌతాఫ్రికా తదుపరి వన్డేలు!!

India vs South Africa: Lucknow, Kolkata ODIs likely to be played in front of empty stands amid coronavirus pandemic

ముంబై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా గురువారం జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా బంతిపడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అటు అభిమానులు.. ఇటు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశకు గురికావాల్సి వచ్చింది. ఇక తదుపరి రెండు వన్డేలు లక్నో వేదికగా మార్చి 15న, కోల్‌కతాలో మార్చి 18న జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు కరోనా సెగ తగిలింది.

గేట్లు మూసుకొని..

గేట్లు మూసుకొని..

కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సూచనల మేరకు క్రీడాశాఖ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఏవైనా క్రీడా ఈవెంట్స్ వాయిదా వేయలేని పరిస్థితి ఉంటే జనసమూహం లేకుండా నిర్వహించాలని సూచించింది. దీంతో ప్రస్తుతం భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా ఈ మార్గదర్శకాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రేక్షకులు లేకుండానే ఈ రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది

క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు తమకు అందాయని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. ‘క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను బీసీసీఐ అందుకుంది. అంత స్పష్టంగా జనసమూహాలు లేకుండా టోర్నీ నిర్వహించాలని చెప్పినప్పుడు మేం దానికి కట్టుబడి ఉండాలి'అని సదరు అధికారి తెలిపారు.

IND vs SA తొలి వన్డే: ఊరించి.. ఊరించి టాస్ పడకుండానే రద్దు.!!

జనసమూహాలు వద్దు.. దేశ ఆరోగ్యం ముఖ్యం..

జనసమూహాలు వద్దు.. దేశ ఆరోగ్యం ముఖ్యం..

భారత్‌లో ఇప్పటికే 73 కేసులు నమోదవ్వడం.. బుధవారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్‌ను ప్రాణాంతక వైరస్‌గా ప్రకటించడంతో కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగింది. అన్ని శాఖలకు, రాష్ట్రాలకు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి పాటించాల్సిన గైడ్‌లైన్స్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజీజు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు సూచించారు.

‘కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా జనసమూహాలను తగ్గించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు సూచిస్తున్నారు. అందుకే క్రౌడ్ ఎక్కువగా ఉండే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ పాటించాలని క్రీడా ఫెడరేషన్స్‌ను కోరుతున్నాం. వాయిదా వేయలేని టోర్నీలను జనసముహాలు లేకుండా నిర్వహించాలి. అన్నిటి కన్నా దేశ ఆరోగ్యమే ముఖ్యం. 'అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

సహనం కోల్పోయిన బౌలర్.. మిడిల్ స్టంప్ విరగ్గొట్టాడు!! (వీడియో)

లెజెండ్స్ టోర్నీ.. ఐపీఎల్..

లెజెండ్స్ టోర్నీ.. ఐపీఎల్..

ఇక కేంద్రప్రభుత్వ సూచనలతో ప్రస్తుతం జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ కూడా ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఐపీఎల్ నిర్వహించాలన్నా ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా ప్రభావంతో ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకోవడంతో శనివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. రాష్ట్రల అభ్యంతరం, కరోనా, కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్సే ప్రధాన ఎజెండగా ఈ భేటీ జరగనుంది.

Story first published: Thursday, March 12, 2020, 19:39 [IST]
Other articles published on Mar 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X