న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సహనం కోల్పోయిన బౌలర్.. మిడిల్ స్టంప్ విరగ్గొట్టాడు!! (వీడియో)

Jaydev Unadkat loses his cool in Ranji Trophy final, breaks middle stump
Jayadev Unadkat Loses His Cool In Ranji trophy Final Breaks Middle Stump | Oneindia Telugu

రాజ్‌కోట్: బెంగాల్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర కెప్టెన్, పేసర్ జయదేవ్ ఉనాద్కాట్ సహనం కోల్పోయాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడటంతో ఓ దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను బంతిని వికెట్లపైకి బలంగా విసిరాడు. అతని దెబ్బకు మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంతకేం జరిగిందంటే?

బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఉనాద్కాట్ 92.2 బంతిని వేయగా.. బ్యాట్స్‌మన్ డిఫెన్స్ చేశాడు. అది కాస్త వచ్చి ఉనాద్కాట్ చేతిలోనే పడింది. అప్పటికే సహనం కోల్పోయిన అతను తన ఫ్రస్టేషన్‌ను వికెట్లపై తీర్చుకున్నాడు. ఆగ్రహంతో బ్యాట్స్‌మన్ వైపు బంతిని బలంగా విసిరాడు. బ్యాట్స్‌మన్ అప్రమత్తమై తప్పుకోగా.. బంతి నేరుగా మిడిల్ స్టంప్‌కు తగింది. ఈ దెబ్బకు స్టంప్ రెండు ముక్కలైంది.

అవకాశాలు చేజారండంతోనే...

అవకాశాలు చేజారండంతోనే...

అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్ 134/3 నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బెంగాల్‌కు ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ సుదీప్‌ చటర్జీ (81), వృద్దిమాన్ సాహా (64) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఫస్ట్ సెషన్ అంతా ఓపికగా ఆడుతూ.. సౌరాష్ట్ర బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ జోడీ నాలుగో వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది.

అయితే ఫస్ట్ సెషన్‌‌లో ఉనాద్కాట్ బౌలింగ్‌లో సాహా ఇచ్చిన క్యాచ్‌ను సౌరాష్ట్ర ఫీల్డర్ విశ్వరాజ్ జడేజా మిస్ చేశాడు. అనంతరం ఓ క్యాష్ విషయంలో సాహా వికెట్ కోసం సౌరాష్ట్ర రివ్యూ తీసుకుంది. ఇది కూడా ప్రతీకూలంగానే వచ్చింది. బంతి బ్యాట్‌ను తాకిన వెంటనే మైదానానికి తాకి పైకి లేచినట్లు స్పష్టమైంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఉనాద్కాట్ కోపాద్రిక్తుడయ్యాడు. దాన్ని వికెట్ విరగ్గొట్టి తీర్చుకున్నాడు.

వెనుకంజలో బెంగాల్

వెనుకంజలో బెంగాల్

128 ఓవర్లు ముగిసే సరికి బెంగాల్ 6 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. క్రీజులో ముజుందార్ (29 బ్యాటింగ్), నంది (7 బ్యాటింగ్) ఉన్నారు. నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించిన సాహా-సుదీప్ జోడీని ధర్మేంద్ర సింగ్ జడేజా విడదీశాడు. సుదీప్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో 16 పరుగుల వ్యవధిలోనే బెంగాల్ సాహా వికెట్ కూడా కోల్పోయింది. ప్రేరక్ మన్కడ్ బౌలింగ్‌లో సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చి హెహ్‌బాజ్ అహ్మద్ (16) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంకా బెంగాల్ 142 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 425 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Story first published: Thursday, March 12, 2020, 15:53 [IST]
Other articles published on Mar 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X