న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడామనే బాధలేదు.. మూడో వన్డేలో మార్పులుంటాయి: కోహ్లీ

India vs New Zealand: Virat Kohli says one-day cricket not as relevant as T20Is, Tests in 2020

ఆక్లాండ్ : న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి వన్డేలో మార్పులుంటాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
శ‌నివారం జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్ 22 ప‌రుగుల‌తో ఓడి 2-0తో సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఓడామనే బాధ ఏమాత్రం లేదని, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో వన్డేల‌పై అంత‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని తెలిపాడు. ఈ సంవ‌త్స‌రం టెస్టులు, టీ20ల‌పైనే తమ ఫోక‌స్ ఉంటుదన్నాడు. ఇక మూడో వన్డేలో మార్పులు ఉంటాయని కూడా తెలిపాడు.

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేలో ఇది గమనించారా? క్రికెట్ హిస్టరీలోనే చాలా రేర్ ఘటన!!భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేలో ఇది గమనించారా? క్రికెట్ హిస్టరీలోనే చాలా రేర్ ఘటన!!

మార్పులుంటాయ్..

మార్పులుంటాయ్..

‘టెస్టులు మరియు టి 20 లతో పోల్చితే ఈ ఏడాది వన్డేలు అంతగా లేవు, కానీ తీవ్ర ఒత్తిడిలో ఆడే ఆటగాళ్లు ఎవరో తెలియడం మాకు సానుకూలాంశం. చివరి వన్డేలో మార్పుల చేస్తాం. రిజర్వ్ బెంచ్‌ను పరీక్షిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేం కోల్పోయేది ఏమీ లేదు. మేం మంచి క్రికెట్ ఆడాం ఫలితం గురించి ఏ మాత్రం చింతించడం లేదు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మేం బాగానే ఆడాం..

మేం బాగానే ఆడాం..

గత రెండు మ్యాచ్‌ల్లో తమ ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నామని కోహ్లీ తెలిపాడు. ‘రెండు మ్యాచ్‌లు బాగానే ఆడాం. అభిమానులకు మంచి మజా లభించింది. ముఖ్యంగా రెండో వన్డేలో మా ముగింపు నన్ను ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో ప్రత్యర్థిని 197/8 కట్టడి చేసి.. తర్వాత 270 ప్లస్ పరుగుల చేయించాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. భారీ ఓటమి తప్పదనుకున్న మాకు.. జడేజా, సైనీ అద్భుత పోరాటంతో మ్యాచ్‌పై ఆశలు రేకిత్తించారు. అయ్యర్ కూడా ఎప్పటిలానే రాణించాడు.'అని కోహ్లీ కొనియాడాడు.

సైనీ ఇలా ఆడుతాడని ఊహించలేదు..

సైనీ ఇలా ఆడుతాడని ఊహించలేదు..

రెండో వ‌న్డేలో ఫలితం అనుకూలంగా రానప్పటికీ నవదీప్ సైనీ అద్బుతంగా బ్యాటింగ్ చేస్తాడనే విషయం తెలిసింది. ‘సైనీ, జడేజాల పోరాటం వారి వ్యక్తిగతం. మేం వారికి ఎలాంటి సందేశాలివ్వలేదు. ఎందుకుంటే పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని భావించాం. సైనీ ఇంత బాగా ఆడుతాడని అస్సలు ఊహించలేదు. లోయర్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే.. మిడిలార్డర్, టాపార్డర్ కూడా సెట్ అవుతోంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

జాదవ్‌పై వేటు..

జాదవ్‌పై వేటు..

కోహ్లీ మాటలను బట్టి చూస్తే రెండు మ్యాచ్‌ల్లోనూ విఫ‌లమైన కేదార్ జాద‌వ్‌తోపాటు ఓపెన‌ర్ల‌లో ఒక‌రిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అవకాశం దక్కని మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్లలో ఒకరిపై వేటు పడితే పంత్‌కు కూడా అవకాశం దక్కవచ్చు.

అప్పుడు ధోని.. ఇప్పుడు జడేజా మిగతాదంతా సేమ్ టూ సేమ్!!

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల‌కు 273 ప‌రుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్‌ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (73 నాటౌట్‌; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా.. బ్లండెల్‌ (22), జెమీసన్‌ (25 నాటౌట్‌; 24 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.

ఛేద‌న‌లో భార‌త్ 48.3 ఓవ‌ర్ల‌లో 251 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. రవీంద్ర జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (57 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), నవదీప్‌ సైనీ (49 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. 6 అడుగుల 8 అంగుళాల పొడగరి, ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన కివీస్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకుగాను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. చివరి వన్డే మంగళవారం మౌంట్‌ మాంగనీలో జరుగుతుంది.

Story first published: Sunday, February 9, 2020, 15:12 [IST]
Other articles published on Feb 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X