న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియాను వణికించేవాళ్లం: టీమ్ సౌథీ

IND vs NZ: Tim Southee says Its Disappointing Even With The Bat After 3rd T20I Match Ends In A Tie

నేపియర్: వర్షం రాకుండా మ్యాచ్ పూర్తిగా సాగుంటే టీమిండియాను వణికించేవాళ్లమని న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ టీమ్ సౌథీ అన్నాడు. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం టై అయిన విషయం తెలిసిందే. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. మూడో టీ20 అనంతరం మ్యాచ్ టై అవ్వడంపై స్పందించిన సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ పూర్తిగా సాగుంటే.. అభిమానులకు కావాల్సిన మజా లభించేదన్నాడు. వన్డే సిరీస్‌కు సిద్దంగా ఉన్నామని చెప్పిన సౌథీ.. అక్కడ సానుకూల ఫలితం రాబడుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 బంతితో మెరిసాం..

బంతితో మెరిసాం..

'బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యాం. అయితే బౌలింగ్ పరంగా మా సాయశక్తులా పోరాడాలనుకున్నాం. అనుకున్నట్లే ఆరంభంలోనే వికెట్ల పడగొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాం. వికెట్లు తీస్తే ఏమైనా జరగవచ్చనే విషయం మాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ పూర్తిగా జరుగుంటే రసవత్తరపోటీ ఉండేది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగేది. వర్షం వచ్చినప్పుడు మ్యాచ్ టై అయిందా లేదా అనే విషయంపై కాస్త అనిశ్చితి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌లో బంతితో రాణించడం సంతోషాన్నిచ్చింది. క్వాలిటీ టీమ్ అయిన భారత్‌తో మళ్లీ వన్డే క్రికెట్ ఆడే అవకాశం రావడం బాగుంది. ఈ ఫార్మాట్‌లోనైనా ఆశించిన ఫలితాలతో మా అభిమానులను అలరిస్తామని ఆశిస్తున్నా'అని టీమ్ సౌథీ తెలిపాడు.

రఫ్ఫాడించిన సిరాజ్..

రఫ్ఫాడించిన సిరాజ్..

ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డేవాన్ కాన్వే(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), గ్లేన్ ఫిలిప్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం అందించింది.

ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఓ దశలో కివీస్ 190 ప్లస్ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో ఈ జోడీని విడదీసి కివీస్ పతనాన్ని శాసించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లు తీయగా... హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. సిరాజ్(4/17), అర్ష్‌దీప్ సింగ్‌(4/37)లు టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు.

టాపార్డర్ విఫలం..

టాపార్డర్ విఫలం..

161 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్), దీపక్ హుడా(9 నాటౌట్) ఉన్నారు. వర్షం భారీగా రావడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. అయితే ఈ పద్దతిన టీమిండియా సరిగ్గా అన్నే పరుగులు చేయడంతో టైగా ప్రకటించారు.

ఓపెనర్లు ఇషాన్ కిషన్(10), రిషభ్ పంత్(11) మరోసారి విఫలమవ్వగా.. శ్రేయస్ అయ్యర్(0) మరో అవకాశాన్ని చేజార్చుకున్నారు. గత మ్యాచ్ సెంచరీ హీరో సూర్యకుమార్ యాదవ్(13) సైతం విఫలమయ్యాడు. సూపర్ బౌలింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Tuesday, November 22, 2022, 19:11 [IST]
Other articles published on Nov 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X