న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షెఫాలీకి భారీ షాట్లు ఆడటం ఇష్టం.. ఆమెను అడ్డుకోం : హర్మన్‌ప్రీత్

Harmanpreet Kaur Says Shafali loves playing big shots, We dont want to stop her

మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతుంది. శనివారం శ్రీలంకత జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా భారత మహిళలు సమష్టి ప్రదర్శనతో అలరించారు. ముందుగా అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన హర్మన్ సేన.. అనంతరం సూపర్ బ్యాటింగ్‌లో అలవోక విజయాన్నందుకున్నారు.

ఫెఫాలీ కీలకం..

ఫెఫాలీ కీలకం..

అయితే భారత్ వరుసగా గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మది కీలక పాత్ర. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్‌పైనే భారత బ్యాటింగ్ ఆధారపడి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 39,39,46,47 వరుసగా ఆమె చేసిన పరుగులే దీనికి నిదర్శనం. శ్రీలంకతో కూడా అదరగొట్టిన ఈ లేడీ సెహ్వాగ్ రనౌట్‌‌‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది.

షెఫాలీని అడ్డుకోం..

షెఫాలీని అడ్డుకోం..

అయితే శ్రీలంకతో విజయానంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ షెఫాలీ వర్మపై ప్రశంసల జల్లు కురిపించింది.‘షెఫాలీ భారీ షాట్లు ఆడటానికి ఇష్టపడుతుంది. ఆమె విధ్వంసాన్ని మేం అడ్డుకోవాలనుకోవడం లేదు. షెఫాలీ తన దూకుడును అలానే కొనసాగిస్తూ తన ఆటను ఆస్వాదించాలి.'అని హర్మన్ ప్రీత్ తెలిపింది.

కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

ఈ రోజు ట్రై చేశా..

ఈ రోజు ట్రై చేశా..

ఇక ఈ మెగాటోర్నీలో విఫలమవుతున్న హర్మన్‌ప్రీత్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా గత ఈ హిట్టర్ స్థాయికి తగ్గ ప్రదర్శన బాకీ ఉంది. అయితే శ్రీలంకతో బాగా ఆడాలని ప్రయత్నించినట్లు ఈ లేడీ కెప్టెన్ చెప్పుకొచ్చింది. ‘ఈ రోజు సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించా. కొన్ని భారీ షాట్లు కూడా ఆడాను. భవిష్యత్తు మ్యాచ్‌ల్లో నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.'అని తెలిపింది.

రాధా సూపర్ బౌలింగ్..

రాధా సూపర్ బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ చమరి ఆటపట్టు(33), కవిశ దిల్‌హరి(25 నాటౌట్) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలింగ్‌లో రాధా యాదవ్‌ 4, రాజేశ్వర్ గైక్వాడ్ 2 దీప్తీ శర్మ, శిఖా పాండే, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు.. 14.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి 32 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. భారత బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ(47) మరోసారి మెరుపులు మెరిపించగా.. స్మృతి మంధాన(17), హర్మన్ ప్రీత్ కౌర్(15) విఫలమయ్యారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్), దీప్తీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో ఉదేశిక, సిరివర్థనే తలో వికెట్ తీశారు.

Story first published: Saturday, February 29, 2020, 19:08 [IST]
Other articles published on Feb 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X