న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కళ్లు చెదిరే యార్కర్‌తో బ్యాట్స్‌మన్‌‌ను గోల్డెన్ డక్ చేసి క్షమాపణలు చెప్పిన బౌలర్ (వీడియో)

Haris Rauf apologises to Shahid Afridi after dismissing him for a golden duck

కరాచీ: కరోనాతో ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్( పీఎస్‌ఎల్) 2020 సీజన్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ప్రాణాంతక వైరస్ కారణంగా ఈ పాక్ టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆగిపోగా.. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌తో ఆటంకం ఏర్పడింది. దాంతో ఐపీఎల్ ముగిసే వరకు వేచి చూసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారత క్యాష్ రిచ్ లీగ్ దిగ్విజయంగా పూర్తవడంతో పీఎస్ఎల్ తదుపరి ఘట్టాన్ని షురూ చేసింది.

ఈ క్రమంలోనే శనివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1‌లో గెలుపొందిన కరాచీ కింగ్స్ నేరుగా ఫైనల్ చేరగా.. లాహోర్ ఖలాండర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన పెష్వార్ జల్మీ ఇంటిదారిపట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో ముల్తాన్ సుల్తాన్స్‌పై ఖలాండర్స్ 25 పరుగులతో గెలుపొంది టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రిది ఔటైన తీరును అందరిని ఆకట్టుకుంది.

అఫ్రిది గోల్డెన్ డక్..

ముల్తాన్ సుల్తాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఖలాండర్స్ పేసర్ హరీస్ రౌఫ్ వరుస బంతుల్లో వికెట్లు తీశాడు. ముందుగా రీలీ రుసౌను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన హరీస్.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన షాహిద్ అఫ్రిదిని గోల్డెన్ డక్ చేశాడు. హరీస్ కళ్లు చెదిరే ఇన్ స్వింగర్ యార్కర్‌కు అఫ్రిది మిడిల్ స్టంప్ గాల్లోకి లేచింది.

ఏమాత్రం ఊహించని ఈ బంతికి అఫ్రిది దిమ్మతిరిగిపోయింది. అయితే తన అభిమాన క్రికెటర్‌ను గోల్డెన్ డక్ చేసాననుకున్నాడో ఏమో కానీ వికెట్ తీయగానే సంబరాలు చేసుకోకుండా హరీస్ రౌఫ్ రెండు చేతులు జోడించి నమస్కారం చెబుతూ క్షమాపణలు కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

విజృంభించిన డేవిడ్, హరీస్

విజృంభించిన డేవిడ్, హరీస్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలాండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఫకార్ జమాన్(46), డేవిడ్ వీస్(48 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముల్తాన్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. జునైద్ ఖాన్, మహ్మద్ ఇల్యాస్, సోహైల్ తన్వీర్, ఆడమ్ లిత్ తలో వికెట్ తీశారు. అనంతరం ముల్తాన్ సుల్తాన్ 19.1 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలి 25 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. డేవిడ్, హరిస్ మూడేసి వికెట్లు తీయగా.. షాహిన్ షా, దిల్‌బార్ హోస్సెస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మంగళవారం జరిగే ఫైనల్లో కరాచీ కింగ్స్‌తో లాహోర్ ఖలాండర్స్ తలపడనుంది.

అఫ్రిది అట్టర్ ఫ్లాఫ్..

అఫ్రిది అట్టర్ ఫ్లాఫ్..

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది కేవలం టీ20 లీగ్‌లు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. దాంతో చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన అఫ్రిది.. దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో 12, 0తో అభిమానులను తీవ్రంగా నిరాపరిచాడు. దాంతో అఫ్రిది బ్యాటింగ్‌పై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక కరోనా టైమ్‌లో పేద ప్రజలందరికి రేషన్, సరకులు అందజేసిన అఫ్రిది.. కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

ఇదేం హెల్మెట్..

ఇదేం హెల్మెట్..

క్వాలిఫయర్ 1 మ్యాచ్ సందర్భంగా బంతి సరిగ్గా కనబడాలనే ఉద్దేశంతో అఫ్రిది హెల్మెట్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. గ్రిల్స్ తక్కువగా ఉన్న ఈ హెల్మెట్‌‌ను చూసి అభిమానులు అఫ్రిది భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా చెప్పండయ్యా.. ఆ హెల్మెట్ వాడవద్దని కామెంట్ చేశారు. అతని ప్రాణాలకు ప్రమాదమని సూచించారు. ‘నువ్వు హెల్మెట్ మార్చినా.. నీ ఆట మాత్రం మారలేదు'అని ఒకరంటే.. ‘ఫిలిప్ హ్యూస్ మరణం గుర్తులేదా..? బంతి తాకితే పైకే పోతావ్'అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ అజాగ్రత్త పనికిరాదని, మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు. ప్రస్తుతం అఫ్రిది హెల్మెట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

టీమిండియా సెలెక్టర్ రేస్‌లో అజిత్ అగార్కర్, మణిందర్!

Story first published: Monday, November 16, 2020, 11:22 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X