న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా సెలెక్టర్ రేస్‌లో అజిత్ అగార్కర్, మణిందర్!

Ajit Agarkar, Maninder Singh, Chetan Sharma, SS Das in fray for Team India selector job

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యుల పోస్టులకు పోటీ బాగానే పెరిగింది. ఖాళీగా ఉన్న మూడు పోస్ట్‌ల కోసం పలువురు మాజీ క్రికెటర్లు పోటీపడుతున్నారు. మాజీ పేసర్లు అజిత్ అగార్కర్, చేతన్‌ శర్మ తో పాటు మాజీ స్పిన్నర్ మణిందర్‌ సింగ్‌, ఓపెనర్ శివ సుందర్‌ దాస్‌ బలమైన అభ్యర్థులుగా రేసులో ముందున్నారు. సెలెక్టర్ల ఎంపిక విషయంలో బీసీసీఐ జోనల్ పాలసీకి కట్టుబడుతుందా? లేక కొత్త రాజ్యంగం ప్రకారం ముందుకెళ్తుందా? అన్నది తేలాల్సి ఉంది. గతేడాది సునీల్ జోషి, హర్విందర్ సింగ్‌ను జోనల్ ప్రకారమే తీసుకున్నారు.

అయితే కొత్త రాజ్యంగం ప్రకారం అత్యుత్తమ ఐదుగురిని ఎంచుకునే అవకాశం ఉంది. అందుకే అప్లికేషన్స్‌లో ఎక్కడా జోనల్ ప్రస్తావనను తీసుకురాలేదు. మరోవైపు గతంలో అప్లై చేసిన అగార్కర్, మణిందర్ రీ అప్లై చేయడంపై కూడా బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీళ్లిద్దరూ మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని లాక్‌డౌన్‌కు ముందు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కొంత క్లారిటీ ఇచ్చాడు.

దాంతో అగార్కర్, మణిందర్ రేస్‌లో ముందుకొచ్చారు. అంతర్జాతీయ అనుభవం ఎక్కువగా ఉన్న అగార్కర్... సెలెక్షన్ చైర్మన్ పదవికి ప్రధాన పోటీదారుడుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే.. ప్రస్తుత చైర్మన్‌ సునీల్‌ జోషికంటే అగార్కర్‌కు ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. దాంతో లోధా సంస్కరణల ప్రకారం ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ చైర్మన్‌గా ఉండాలి. బెంగాల్‌ మాజీ పేసర్‌ రణదేవ్‌ బోస్‌ కూడా రేస్‌లో నిలిచాడు.

ఇర్ఫాన్ పఠాన్ సలహా వల్లే ఇక్కడి దాకా వచ్చా: అబ్దుల్ సమద్ఇర్ఫాన్ పఠాన్ సలహా వల్లే ఇక్కడి దాకా వచ్చా: అబ్దుల్ సమద్

Story first published: Monday, November 16, 2020, 9:51 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X