న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రీ ఎంట్రీలో సిక్సర్ల మోతతో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా .!

Hardik Pandya hits 4 towering sixes on his return to professional cricket

ముంబై: వెన్నుగాయంతో ఆటకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీలో అదరగొట్టాడు. సర్జరీ చేయించుకుని సుదీర్ఘ విరామం తీసుకున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్.. బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే సిక్సర్ల మోత మోగించాడు. తద్వార ఐపీఎల్‌కు తాను రెడీ అన్నట్లు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు.

నాలుగు సిక్సర్లతో..

నాలుగు సిక్సర్లతో..

డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున బరిలోకి దిగిన పాండ్యా తన సహజ సిద్ధమైన ఆటతో అలరించాడు. 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 12 బంతులకు 7 పరుగులు మాత్రమే చేసిన ఈ బరోడా ప్లేయర్.. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

నాలుగో స్థానంలో

నాలుగో స్థానంలో

తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్ టీమ్.. 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ ముందు క్రీజ్‌లో కుదురుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ.. రిలయన్స్‌‌కు 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జట్టు 125 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఆ జట్టు తరఫున శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు బరిలోకి దిగారు.

త్వరలో భారత జట్టులోకి..

త్వరలో భారత జట్టులోకి..

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన పాండ్యా.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ ‘ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అతను వర్క్‌లోడ్ టెస్ట్‌లో విఫలమవడంతో ఆ టూర్‌కు దూరమయ్యాడు. పాండ్యాను జట్టులో తీసుకురావాడానికి టీమ్‌మేనేజ్‌మెంట్ బాగా ప్రయత్నించింది. అతని కోసం జట్ల ఎంపికను వాయిదా వేసింది. అతను పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని భావించి ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. పాండ్యా లేని లోటు భారత్‌కు స్పష్టంగా తెలుస్తోంది.

కానీ తాజా మ్యాచ్‌తో పాండ్యా పూర్తి ఫిట్‌గా మారిన‌ట్లు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సంకేతాలు పంపాడు. ఈక్ర‌మంలో వ‌చ్చేనెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగే మూడు వ‌న్డేల సిరీస్‌కు టీమిండియా సెలెక్ష‌న్‌పై అంద‌రి దృష్టి నెల‌కొంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ కీలక ఆటగాడైన హార్దిక్‌ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించిన ఎమ్మెస్కే

హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించిన ఎమ్మెస్కే

తాజా మ్యాచ్‌లో హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ దగ్గరుండి పర్యవేక్షించాడు. అతను ఎంతవరకూ తేరుకున్నాడు అనే అంశాన్ని ఎంఎస్‌కే పరిశీలించారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ కూడా హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించింది.

Story first published: Saturday, February 29, 2020, 14:59 [IST]
Other articles published on Feb 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X