న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌.. నిరసన తెలిపిన యువరాజ్‌ సింగ్

Global T20 Canada: Yuvraj Singh Team Refuses To Play Over Unpaid Wages

ఒట్టావా: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో నిరసన వ్యక్తం చేసాడు. అతనితో పాటు టొరంటో నేషనల్స్‌, మాంట్రియల్‌ టైగర్స్‌ జట్టు సభ్యులు అందరూ నిరసన వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌ రెండో ఎడిషన్‌లో టొరంటో నేషనల్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ క్రికెట్‌కు హషీం ఆమ్లా వీడ్కోలు

జట్టు యాజమాన్యం ఆటగాళ్లకు ఇవ్వాల్సిన రుసుమును ఇవ్వనందుకు టొరంటో, మాంట్రియల్‌ జట్ల ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేసారు. ఆటగాళ్లు స్టేడియానికి వెళ్లకుండా వారు బస చేసే హోటల్ వద్దే ఉండి నిరసన వ్యక్తం చేశారు. లీగ్‌ నిర్వాహకులు జోక్యం చేసుకుని ఆటగాళ్లతో చర్చించిన తర్వాత వారు మైదానానికి వచ్చారు. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ బెయిలీ నేతృత్వంలోని మాంట్రియల్‌ టైగర్స్‌తో టొరంటో నేషనల్స్‌ ఆడాల్సిన మ్యాచ్‌ దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

'టొరంటో నేషనల్స్‌, మాంట్రియల్‌ టైగర్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీ, లీగ్‌ నిర్వాహకుల మధ్య వేతనాల విషయంలో సమస్య తలెత్తడంతో మ్యాచ్‌ ఆలస్యమైంది. అందరూ సమావేశమై సమస్యలను పరిష్కరించారు. ఈ అసౌకర్యానికి గురిచేసినందుకు చింతిస్తున్నాం' అని లీగ్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

గ్లోబల్‌ టీ20 తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో 'సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్‌ ఆలస్యమైందని' పోస్ట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో మాంట్రియల్‌ నేషనల్స్‌పై టొరంటో నేషనల్స్‌ 35 పరుగుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టొరంటో జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఈ లీగ్‌లో యువరాజ్‌ చెలరేగుతున్న విషయం తెలిసిందే.

రెండు సార్లు ఓవర్ల కుదింపు.. భారత్, వెస్టిండీస్‌ తొలి వన్డే రద్దు

Story first published: Friday, August 9, 2019, 10:46 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X