న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు హషీం ఆమ్లా వీడ్కోలు

South Africa batsman Hashim Amla retires from international cricket

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే దేశవాళీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని ఆమ్లా తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు మూడు రోజుల వ్యవధిలో మరో దిగ్గజ ఆటగాడి సేవలు కోల్పోయింది. సోమవారం స్పీడ్ గన్ డేల్ స్టెయిన్‌ టెస్టుల నుండి రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెగెలిసిందే.

<strong>రెండు సార్లు ఓవర్ల కుదింపు.. భారత్, వెస్టిండీస్‌ తొలి వన్డే రద్దు</strong>రెండు సార్లు ఓవర్ల కుదింపు.. భారత్, వెస్టిండీస్‌ తొలి వన్డే రద్దు

ఒక్క సెంచరీ కూడా లేదు:

ఒక్క సెంచరీ కూడా లేదు:

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌-2019 శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ఆమ్లా కెరీర్‌లో చివరిది. ఇక లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న ఆమ్లా.. చివరకు కెరీర్‌ ముగించాలని ప్రపంచకప్‌ సమయంలోనే నిర్ణయించుకున్నాడు. టెస్టుల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ప్రపంచకప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో 203 పరుగులే చేసి విఫలమయ్యాడు.

2004లో కెరీర్‌ ఆరంభం:

2004లో కెరీర్‌ ఆరంభం:

హషీం ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ 2004లో ప్రారంభమైంది. కోల్‌కతాలో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆమ్లా తన కెరీర్‌ను ఆరంభించాడు. తొలి 3 టెస్టుల్లో 62 పరుగులే చేయడంతో.. జట్టులో చోటు కోల్పోయాడు. 15 నెలల తర్వాత కివీస్‌పై భారీ సెంచరీతో సత్తా చాటాడు. ఇక 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో ఆమ్లాకు ఎదురు లేకుండా పోయింది. 2008లో లార్డ్స్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌ ఆడుతూ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 2012లో ఇంగ్లండ్‌పై ఓవల్‌ మైదానంలో 13 గంటలకు పైగా క్రీజులో ఉండి అజేయంగా 311 పరుగులు చేసాడు. 14 టెస్టుల్లో సఫారీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

శ్రీలంకపై చివరి మ్యాచ్:

శ్రీలంకపై చివరి మ్యాచ్:

టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆమ్లా.. వన్డేల్లోనూ రాణించాడు. తొలి టెస్టు ఆడిన దాదాపు నాలుగేండ్ల తర్వాత వన్డేల్లో చాన్స్ వచ్చింది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో ఆమ్లా వన్డేల్లో తన ఉనికిని చాటాడు. ఆ ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో 1058 పరుగులు చేసాడు. కెరీర్‌లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగుల వరకు ప్రతీ వేయి పరుగుల మైలురాయిని అందరికంటే వేగంగా ఆమ్లానే చేరున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (27) సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. ఇటీవల ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ అతనికి చివరిది. ఆ మ్యాచ్‌లో ఆమ్లా 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మారని ఆటతీరు.. తెలుగు టైటాన్స్‌ ఖాతాలో మరో ఓటమి

4 డబుల్ సెంచరీలు:

4 డబుల్ సెంచరీలు:

ఆమ్లా 124 టెస్ట్‌లు, 181 వన్డేలు, 44 అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 46.64 సగటుతో 28 సెంచరీలతో పాటు 4 డబుల్ సెంచరీలు సాధించి 9282 పరుగులు సాధించాడు. వన్డేల్లో 49.46 సగటుతో 27 శతకాలతో 8113, టీ20ల్లో 1277 పరుగులు చేసాడు. టీ20ల్లో అత్యధిక స్కోర్‌ 97.

ఎన్నో పాఠాలు నేర్చుకున్నా:

ఎన్నో పాఠాలు నేర్చుకున్నా:

ఆమ్లా మాట్లాడుతూ.. 'దక్షిణాఫ్రికా జట్టుతో నా ప్రయాణం విజయవంతంగా సాగింది. నాకు సహకరించిన జట్టు సభ్యులు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. జట్టు సభ్యులతో సోదర సమానంగా ప్రేమను పంచుకున్నా. ప్రేమతో నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులకు కృతజ్ఞతలు' అని ఆమ్లా తెలిపాడు.

Story first published: Friday, August 9, 2019, 10:12 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X