న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఫాస్ట్ బౌలర్లు ఒత్తిడికి గురి కాకూడదు.. ఫుల్‌టాస్‌లు వేయొద్దు'

Glenn McGrath shares useful knowledge with Young Players

హైదరాబాద్: ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురి కాకూడదు. అదేసమయంలో ఫుల్‌టాస్‌ బంతులు వేయకూడదు అని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సూచించారు. క్యాన్సర్‌ వ్యాధి నివారణకు ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ కార్యక్రమంలో మెక్‌గ్రాత్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన క్రీడా జీవితానికి సంబంధించిన విషయాలను అక్కడి స్థానిక క్రీడాకారులతో పంచుకున్నాడు.

నిషేధిత జింబాబ్వే అభ్యర్థనను అంగీకరించిన బంగ్లా.. ట్రై-సిరీస్‌కు ఆతిథ్యం

మెక్‌గ్రాత్‌ ఆటగాళ్లతో మాట్లాడుతూ... 'ఎంఆర్‌ఎఫ్‌ ఫౌండేషన్‌ ద్వారా క్రీడాకారులకు కోచింగ్‌ ఇవ్వడానికి ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియాలో క్రికెట్ జాతీయ క్రీడ. ప్రస్తుతం అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. నాకు కుటుంబం నుంచి పూర్తి సహకారం ఉంది. బౌలర్‌గా చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. టీ20, వన్డేల మధ్య మానసిక ఒత్తిడిలో తేడా ఉంటుంది. 1997లో మొదటి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు, 2007లో చివరి వన్డే ఆడినప్పుడు నాది ఒకేరకమైన పరిస్ధితి' అని మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు.

'భారత్‌లో చాలామంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. వర్ధమాన క్రికెటర్లు శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురి కాకూడదు. అదేసమయంలో ఫుల్‌టాస్‌ బంతులు వేయకూడదు. నిజానికి ఫాస్ట్ బౌలర్లకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం. పూర్తి ఏకాగ్రతతతో ఉండాలి, సమయానికి అనుకూలంగా వ్యవహరించాలి. క్రీడాకారులందరికీ యోగాతో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈతరం ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు' అని మెక్‌గ్రాత్‌ చెప్పుకొచ్చారు.

మా తప్పేమీ లేదు.. పృథ్వీ షా డోపింగ్‌ వివరాలు వెల్లడించిన బీసీసీఐ

తాజాగా ఆసీస్ అసిస్టెంట్‌ కోచ్‌ రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'మెక్‌గ్రాత్‌కు లార్డ్స్‌ మైదానంలో గొప్ప రికార్డ్ ఉంది. లార్డ్స్‌లో బౌలింగ్‌ చేయడాన్ని మెక్‌గ్రాత్‌ ఎక్కువ ఇష్టపడేవాడు. మెక్‌గ్రాత్‌ గొప్ప స్వింగ్‌ బౌలర్‌ కాదు. కానీ.. సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తాడు. ప్రస్తుతం సిడెల్‌ కూడా అదే తరహాలో బౌలింగ్‌ చేస్తున్నాడు. సిడెల్‌ను చూస్తుంటే మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడు' అని పేర్కొన్నాడు.

Story first published: Friday, August 9, 2019, 16:12 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X