న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిషేధిత జింబాబ్వే అభ్యర్థనను అంగీకరించిన బంగ్లా.. ట్రై-సిరీస్‌కు ఆతిథ్యం

Bangladesh accept Zimbabwes request, to host tri-series in September

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించిన జింబాబ్వే‌ క్రికెట్ జట్టుకు ట్రై-సిరీస్‌ కోసం ఆతిథ్యమిచ్చేందుకు బంగ్లాదేశ్ hసిద్ధమైంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జింబాబ్వే‌ను తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాడు. ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుతో పాటు జింబాబ్వేతో టీ20 ట్రై-సిరీస్‌ సంబంధించిన షెడ్యూల్‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బుధవారం ప్రకటించింది. అఫ్గానిస్థాన్ జట్టుతో సెప్టెంబర్ 5 నుండి ఛటోగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే జట్ల మధ్య ట్రై-సిరీస్‌ జరగనుంది.

విండీస్‌తో తొలి వన్డే.. మైదానంలోనే కోహ్లీ స్టెప్పులు (వీడియో)విండీస్‌తో తొలి వన్డే.. మైదానంలోనే కోహ్లీ స్టెప్పులు (వీడియో)

'ఐసీసీ ఎఫ్‌టిపి షెడ్యూల్ ప్రకారం ఒక టెస్ట్ మ్యాచ్, వన్డే లేదా టీ20 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాలి. అయితే జింబాబ్వే క్రికెట్ బోర్డు అభ్యర్థన మేరకు ట్రై-సిరీస్‌ నిర్వహిస్తున్నాం. జింబాబ్వేతో మ్యాచ్ ఆడడంలో మాకు ఎలాంటి సమస్య లేదు. ఐసీసీ నిబంధలు ప్రకారం వారు ఐసీసీ టోర్నీలలో పాల్గొనకూడదు. నిషేధం ప్రకారం వారు పాల్గొనడం గందరగోళంగా ఉంది, కానీ జింబాబ్వే క్రికెట్ బోర్డు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు' అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి అన్నారు.

'ట్రై-సిరీస్‌ గురించి ఐసీసీ అధికారులతో మాట్లాడాం. వారు జింబాబ్వేపై ద్వైపాక్షిక, ముక్కోణపు సిరీస్‌లో ఆంక్షలు ఉన్నట్లు చెప్పలేదు. జింబాబ్వేని కేవలం ఐసీసీ టోర్నీ నుంచి మాత్రమే నిషేధం విధించినట్లు స్పష్టమైంది. దీంతో సిరీస్‌లో జింబాబ్వే జట్టు‌కి స్థానం కల్పించాం' అని బంగ్లా అధికార ప్రతినిధి యూనస్ పేర్కొన్నాడు. ఇటీవలే జింబాబ్వే జట్టుని ఐసీసీ ఈవెంట్ల నుంచి ఐసీసీ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీలోని సభ్య దేశాలతో ద్వైపాక్షిక, ముక్కోణపు సిరిస్‌లు ఆడేందుకు మాత్రం అనుమతి ఉంది.

ధోనీకి అరుదైన గౌరవం: అక్కడ జెండా ఎగరేయనున్న క్రికెటర్ధోనీకి అరుదైన గౌరవం: అక్కడ జెండా ఎగరేయనున్న క్రికెటర్

సెప్టెంబర్ 8న జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌కు రానుంది. ముక్కోణపు సిరిస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌లు మిర్‌పుర్‌లోని షేర్-ఈ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్‌లు ఛటోగ్రామ్‌లోనే జరగనున్నాయి. ఇక, సెప్టెంబర్ 24న జరగననున్న ఫైనల్ మ్యాచ్‌కి షేర్-ఈ-బంగ్లా నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

షెడ్యూల్ విడుదల చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు:

బంగ్లాదేశ్ Vs ఆప్ఘనిస్థాన్ ఏకైక టెస్టు: సెప్టెంబర్ 5-9, ఛటోగ్రామ్‌

బంగ్లాదేశ్ v జింబాబ్వే v ఆప్ఘనిస్థాన్ ముక్కోణపు టీ20 సిరిస్

బంగ్లాదేశ్ v జింబాబ్వే, 1st T20I, సెప్టెంబర్ 13

ఆఫ్ఘనిస్తాన్ v జింబాబ్వే, 2nd T20I, సెప్టెంబర్ 14

బంగ్లాదేశ్ v ఆఫ్ఘనిస్తాన్, 3rd T20I, సెప్టెంబర్ 15

బంగ్లాదేశ్ v జింబాబ్వే, 4th T20I, సెప్టెంబర్ 18

ఆఫ్ఘనిస్తాన్ v జింబాబ్వే, 5th T20I ఐ, సెప్టెంబర్ 20

బంగ్లాదేశ్ v ఆఫ్ఘనిస్తాన్, 6th T20I, సెప్టెంబర్ 21

Story first published: Friday, August 9, 2019, 14:35 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X