న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు సిక్సులు, మూడు గుడ్లు... ప్రతీకారాన్ని తీర్చుకునేలా చేశాయి

Five sixes, three eggs & an act of revenge: Watch Shreyas Iyer’s hilarious Chahal TV interview

హైదరాబాద్: ఐదు సిక్సులు, మూడు గుడ్లు తిని వెస్టిండిస్‌పై ప్రతీకారం తీర్చుకున్నానని యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించి శ్రేయస్ అయ్యర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

PKL 2019: సొంతగడ్డపై తలైవాస్‌ను బెంగళూరు బుల్స్ ఓడించేనా?

ఈ మ్యాచ్ అనంతరం యుజువేంద్ర చాహల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో శ్రేయస్‌ అయ్యర్‌ నవ్వులతో ముంచెత్తాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం ఎలా ఉందన్న ప్రశ్నకు గాను "నా ఆటపట్ల సంతృప్తిగా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల మధ్యే ఆడాలనుకుంటున్నా. నేను దీనిని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మ్యాచ్‌ ఎప్పుడైనా మారొచ్చు, జట్టు స్థానంలో ఏదైనా జరగవచ్చు" అంటూ సమాధానమిచ్చాడు.

మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించడపై అడిగిన ప్రశ్నకు "మా బౌలర్లపై విరుచుకు పడినందుకు, నేను ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. పూరన్‌ అద్భుతమైన ఆటగాడు. అయితే చాహల్‌ బౌలింగ్‌లో ఎదురుదాడి చేసి పరుగులు రాబట్టాడు. నాకు కోపమొచ్చి ప్రతీకారం తీర్చుకున్నా" అని చెప్పాడు.

ఇక, ఉదయం ఏం తిన్నావని అడిగిన ప్రశ్నకు గాను రోజూ లాగే మూడు గుడ్లు తిన్నానంటూ సరదాగా సమాధానమిచ్చాడు‌. మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 65 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

నవ్వులు పూయించింది: లార్డ్స్‌లో స్మిత్ చిత్ర విచిత్ర డ్యాన్స్‌ విన్యాసాలు (వీడియో)

తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, మిగతా రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగగా... శ్రేయాస్ అయ్యర్‌ హాఫ్ సెంచరీలతో రాణించాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే, టెస్టు సిరిస్ ఆరంభానికి ముందు వెస్టిండిస్ క్రికెట్‌ బోర్డు ఎలెవెన్‌తో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Saturday, August 17, 2019, 16:35 [IST]
Other articles published on Aug 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X