నవ్వులు పూయించింది: లార్డ్స్‌లో స్మిత్ చిత్ర విచిత్ర డ్యాన్స్ విన్యాసాలు (వీడియో)

హైదరాబాద్: 'నువ్వు బంతుల్ని వదిలి వేయడంలో మాస్టర్‌వి' స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలివి. స్టీవ్ స్మిత్ ఏంటీ బంతులను వదిలేయడం ఏంటని అనుకుంటున్నారా? యాషెస్ సిరిస్‌లో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
లార్డ్స్ వేదికగా బుధవారం రెండో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కాగా, గురువారం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.

వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే
అయితే, మూడో రోజైన శుక్రవారం కూడా వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓపెనర్ డేవిడ్‌వార్నర్(3) నిరాశపరచగా బాన్‌క్రాఫ్ట్(13), ఉస్మాన్ ఖవాజా(36)లు జట్టు స్కోరు 60 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.

చెత్త బంతులను వదిలేసే మరో వికెట్ పడకుండా
అనంతరం మరో 11 పరుగుల స్వల్ప తేడాలో ట్రావిస్ హెడ్(7) కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం స్టీవ్‌స్మిత్(13), మాథ్యూస్ వేడ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. అయితే, ఇంగ్లాండ్ బౌలర్లు విసిరిన బంతులను ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తెలివిగా చెత్త బంతులను వదిలేసే మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసిన ఆసీస్
దీంతో మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ బౌలర్లను స్టీవ్ స్మిత్ ఎదుర్కొన్న తీరు మాత్రం నవ్వులు పూయించింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆఫ్ స్టంప్ బంతులను వదిలేసే క్రమంలో స్టీవ్ స్మిత్ చిత్రవిచిత్రంగా డ్యాన్స్ విన్యాసాలు చేస్తూ అభిమానులను అలరించాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని వీక్షించిన ఓ నెటిజన్ 'నువ్వు బంతుల్ని వదిలి వేయడంలో మాస్టర్‌వి' అంటూ ప్రశంసించగా... మరొక నెటిజన్ 'స్మిత్ ఆకట్టుకునే బ్యాట్స్‌మన్ కాకపోయినప్పటికీ, బంతుల్ని విడిచిపెట్టడంలో స్పెషల్ టాలెంట్ మాత్రం అతనికే సొంతం' అంటూ ఎద్దేవా చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications