For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: సొంతగడ్డపై తలైవాస్‌ను బెంగళూరు బుల్స్ ఓడించేనా?

Pro Kabaddi League: Tamil Thalaivas eye winning start to home leg against Bengaluru Bulls

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో వరుస విజయాలు సాధిస్తోన్న తమిళ తలైవాస్ శనివారం నుంచి సొంతగడ్డపై తలపడనుంది. లీగ్‌లో భాగంగా శనివారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకి బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్‌ తలపడనుంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

సొంతగడ్డపై తమిళ తలైవాస్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ఈరోజు జరిగే పోరులో అదే ఉత్సాహాంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు బెంగళూరు బుల్స్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం తమిళ తలైవాస్‌కు మరింత కలిసి రానుంది. ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తోన్న జట్లలో తమిళ తలైవాస్ ఒకటి.

గతంలో తెలుగు టైటాన్స్‌కు ఆడిన రాహుల్ చౌదరి ఈ సీజన్‌లో తమిళ తలైవాస్‌కు ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జట్టులో స్టార్ రైడర్‌గా కొనసాగుతున్న రాహుల్ చౌదరి ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 42 పాయింట్లతో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇందులో రెండు సూపర్-10 కూడా ఉన్నాయి.

మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన తమిళ తలైవాస్‌

మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన తమిళ తలైవాస్‌

ఈ సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన తమిళ తలైవాస్‌ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... రెండింట ఓటమి.. ఒక మ్యాచ్‌ని టైగా ముగించింది. దీంతో మొత్తం 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు బుల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.

తమిళ తలైవాస్

తమిళ తలైవాస్

ఆడినవి: 6

గెలిచినవి: 3

టై: 1

ఓడినవి: 2

విన్ రేట్: 50%

బెస్ట్ రైడర్: రాహుల్ చౌదరి

బెస్ట్ ఢిఫెండర్: మన్జీత్ చిల్లర్

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి

ఇక, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బెంగళూరు బుల్స్‌ ఈ సీజన్‌లో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ కుమార్ నేతృత్వంలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో శనివారం నాటి మ్యాచ్‌లో ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. అయితే, ఒత్తిడిని తట్టుకోని జట్టును విజయాల బాట పట్టించడంలో కోచ్ రణవీర్ సింగ్‌ది అందవేసిన చేయి.

బెంగళూరు బుల్స్ జట్టుకు డిఫెన్సే బలం

బెంగళూరు బుల్స్ జట్టుకు డిఫెన్సే బలం

బెంగళూరు బుల్స్ జట్టుకు డిఫెన్సే బలం. ఇక, సూపర్ ట్యాకిల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే 166 సూపర్ ట్యాకిల్స్‌ పాయింట్లను సాధించింది. పవన్ కుమార్ షెరావత్ సీజన్‌లోనే టాప్ రైడర్‌గా కొనసాగుతున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పవన్ ఏకంగా 87 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బెస్ట్ డిఫెండర్‌గా మహేందర్ సింగ్

బెస్ట్ డిఫెండర్‌గా మహేందర్ సింగ్

బెస్ట్ డిఫెండర్‌గా మహేందర్ సింగ్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన మహేందర్ 22 పాయింట్లు సాధించాడు. ట్యాకిల్ స్ట్రయిక్ రేట్ 52 శాతంగా ఉంది. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మూడింట ఓటమిపాలై 22 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

బెంగళూరు బుల్స్

బెంగళూరు బుల్స్

ఆడినవి: 7

గెలిచినవి: 4

టై: 0

ఓడినవి: 3

విన్ రేట్: 57.14%

బెస్ట్ రైడర్: పవన్ షెరావత్

బెస్ట్ ఢిపెండర్: మహేందర్ సింగ్

Story first published: Saturday, August 17, 2019, 15:59 [IST]
Other articles published on Aug 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+