న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వేం కీపర్ అయ్యా.. మరీ ఇంత దారుణమా?

 Fans troll Kamran Akmal for dropping a sitter in Pakistan Super League

రావల్పిండి : పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. పాకిస్థాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్) 2020లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అక్మల్ ఓ సునాయస క్యాచ్ విడిచిపెట్టాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రపంచంలో అత్యంత చెత్త కీపర్ అంటూ మండిపడుతున్నారు.

ఇంతకేం జరిగిందంటే..

పీఎస్‌ఎల్-2020 సీజన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పెష్వార్ జల్మీ తరఫున బరిలోకి దిగిన కమ్రాన్ అక్మల్ సునాయస క్యాచ్‌ను వదిలేశాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ 10 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉండగా.. హసన్ అలీ వేసిన 14 ఓవర్ మూడో బంతిని సోహైల్ ఖాన్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బంతి వికెట్ల వెనుకాలకు గాల్లోకి లేచింది. కొంచెం వెనక్కు పరుగెత్తిన కీపర్ అక్మల్ క్యాచ్ పట్టేశారనుకున్నారు అందరూ.. కానీ అతను సునాయస క్యాచ్ వదిలేయడంతో అంతా అవాక్కయ్యారు. కామెంటేటర్స్ అయితే అసలు అక్మల్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

నువ్వేం కీపర్ సామి..

చాలా సులువైన క్యాచ్ గ్లౌవ్స్ సాయంతో పట్టలేకపోయిన నువ్వేం కీపర్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇతన్ని కీపర్‌గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత చెత్త కీపరని కామెంట్ చేస్తున్నారు. ఏ ఫర్ అక్మల్.. డీ ఫర్ డ్రాప్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

పెష్వార్ జల్మీ విజయం..

పెష్వార్ జల్మీ విజయం..

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పెష్వార్ జల్మీ నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (54) హాఫ్ సెంచరీతో రాణించగా.. హైదర్ అలీ(39) పర్వాలేదనిపించాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 15 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసి ఓటమిపాలైంది.

Story first published: Friday, March 6, 2020, 15:26 [IST]
Other articles published on Mar 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X