న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

South Africa captain Dane Van Niekerk Says Would rather lose than get free pass to T20 World Cup final

సిడ్నీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో సెమీస్ మ్యాచ్ ఆడకుండా ఫ్రీ పాస్‌తో ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే ఉత్తమమని సౌతాఫ్రికా కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ అభిప్రాయపడింది. తన వ్యాఖ్యలతో పరోక్షంగా భారత జట్టు ఫైనల్ చేరడాన్ని ఈ సఫారీ కెప్టెన్ తప్పుబట్టింది.

ఇంగ్లండ్‌తో గురువారం జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దవ్వడం.. గ్రూప్-ఎ టాపర్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించడం తెలిసిందే. అయితే మెగా టోర్నీలో సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ తీరును మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అభిమానులు తప్పుబడుతున్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా సెమీస్ ఆడకపోవడం బాధగానే ఉందని, భవిష్యత్తులోనైనా రిజర్వ్‌డే కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

కరోనా వైరస్ కారణంగా ఐసీసీ లీగ్ మ్యాచ్‌లు వాయిదాకరోనా వైరస్ కారణంగా ఐసీసీ లీగ్ మ్యాచ్‌లు వాయిదా

అదృష్టం కలిసి రాక..

అదృష్టం కలిసి రాక..

ఇక ఇదే మైదానంలో జరిగిన రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా మహిళలపై ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగులతో గెలుపొంది వరుసగా ఆరోసారి ఫైనల్ చేరింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సఫారీలకు 13 ఓవర్లలో 98 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. కానీ అదృష్టం కలిసిరాని సౌతాఫ్రికా.. ఓటమితో మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. వర్షం పడి మ్యాచ్‌ రద్దయినా.. వర్షం అంతరాయం కలిగించకున్నా.. సౌతాఫ్రికాకు ఫైనల్‌ చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ వరణుడు ఆస్ట్రేలియా వైపే నిలిచాడు.

నేను అబద్దాలు చెప్పను..

నేను అబద్దాలు చెప్పను..

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న డేన్ వాన్ నీకెర్క్‌కు వర్షం పడి మ్యాచ్ రద్దయితే గ్రూప్-బి టాపర్‌గా ఫైనల్ చేరొచ్చని మీ జట్టు ఎప్పటికప్పుడు వాతావవరణం అప్‌డేట్స్ తెలుసుకుందంట కదా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తనకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని, తాము అలా ఆలోచించలేదని ఈ సఫారీ కెప్టెన్ సమాధానమిచ్చింది.

‘గ్రౌండ్ స్టాఫ్‌కు నేను క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. వారు అద్భుతంగా మైదానాన్ని సిద్ధం చేశారు. మేం క్రికెట్ ఆడటానికే ఇక్కడి వచ్చాం. ఆడకుండా ఫ్రీ పాస్‌తో ఫైనల్ చేరడం కన్నా ఓడిపోవడమే ఉత్తమం.' అని తెలిపింది.

రిజర్వ్‌డే ఉండాలి..

రిజర్వ్‌డే ఉండాలి..

వాతావరణం కారణంగా ఓటమిపాలవ్వడం.. టోర్నీ నుంచి నిష్క్రమించడం భావ్యం కాదని ఈ సఫారీ కెప్టెన్ చెప్పుకొచ్చింది. భవిష్యత్తులోనైనా రిజర్వ్ డే కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ‘వాతవారణ పరిస్థితుల వల్ల ఓడిపోవడం భావ్యం కాదు. ఇలా ఉండాలని మాత్రం నేను కోరుకోను. భవిష్యత్తులో ఫైనల్, సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే కేటాయిస్తారని విశ్వసిస్తున్నా.'అని డేన్ వాన్ చెప్పుకొచ్చింది.

ఒత్తిడికి చిత్తై..

ఒత్తిడికి చిత్తై..

ఈ సెమీస్ మ్యాచ్‌లో..ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మెగ్‌ లానింగ్‌ (49 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. అనంతరం విరామం సమయంలో మళ్లీ వాన రావడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్దేశించారు. ఐదు ఓవర్లలోపే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. లారా వోల్‌వార్ట్‌ (27 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.

Story first published: Friday, March 6, 2020, 11:00 [IST]
Other articles published on Mar 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X