న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క మ్యాచ్‌కే శాంసన్‌ను తీసేస్తారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

Fans slam BCCI selectors as Sanju Samson snubbed for New Zealand series

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ టూర్‌కు పూర్తిస్తాయి జట్లను ప్రకటిస్తామన్న బీసీసీఐ కేవలం టీ20 జట్టునే ఎంపిక చేసింది.. ఈ నెల 24 నుంచి మొదలయ్యే షార్ట్ ఫార్మాట్ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నేతత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఆదివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్ వ్యవహారంలో నెలకొన్న డ్రామా నేపథ్యంలోనే వన్డే జట్లను హోల్డ్‌లో పెట్టినట్లు బీసీసీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

<strong>మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్న స్మిత్.. కారణం ఇదే?!!</strong>మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్న స్మిత్.. కారణం ఇదే?!!

రోహిత్ ఇన్.. శాంసన్ ఔట్

రోహిత్ ఇన్.. శాంసన్ ఔట్

టీ20 జట్టులో పెద్దగా మార్పులు చేయని సెలెక్టర్లు.. విశ్రాంతిలో ఉన్న రోహిత్ శర్మను జట్టులోకి తీసుకు రాగా.. కేరళ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్‌కు ఉద్వాసన పలికారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ శ్రీలంకతో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన శాంసన్ రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు బంతుల్లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో ఈ కేరళ క్రికెటర్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. అయితే శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం నిర్ణయమంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. శాంసన్‌పై వేటు.. భారత జట్టు ఇదే!!

ఒక్క ఇన్నింగ్స్‌కే తీసేస్తారా.?

ఒక్క ఇన్నింగ్స్‌కే తీసేస్తారా.?

ఒక్క ఇన్నింగ్స్ లో విఫలమైనంత మాత్రనా జట్టు నుంచి తప్పిస్తారా? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘ సంజూ శాంసన్ పై ఎందుకు వేటు వేశారో ఎవరైనా బీసీసీఐని నిలదీయండి. ఒక్క ఇన్నింగ్స్ లో విఫలమైనంత మాత్రానా అలా ఎలా తప్పిస్తారు? మరీ 10 రన్స్ చేసిన శివమ్ దూబేను కూడా టీమ్ మేనేజ్ మెంట్ తప్పిస్తే ఏం జరిగేది?'అని ఒకరు ప్రశ్నించగా... శాంసన్ నాలుగేళ్ల నీరీక్షణ తర్వాత రెండు బంతులే అవకాశం ఇచ్చి మళ్లీ వేటు వేశారని మరొకరు కామెంట్ చేశారు.. ‘ సెలెక్షన్ కమిటీకి పెర్ఫామెన్స్ తో సంబంధం లేదు. వికెట్ కీపర్ గా వా ళ్ల మొదటి చాయిస్ పంతే. కాబట్టి శాంసన్ మరో ఐదేళ్లు నిరీక్షించాల్సిందే. 'అని ఇంకొకరు సెటైరిక్‌గా ట్వీట్ చేశారు.

ఆసీస్ సిరీస్ అనంతరం..

ఆసీస్ సిరీస్ అనంతరం..

సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసాక కోహ్లీ సేన ఈ నెలలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడనుంది. మొదట 24 నుంచి 5 టీ20ల సిరీస్ ఆడనుంది. గాయం నుంచి కోలుకొని శ్రీలంక సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా, ధావన్ కీవీస్ పొట్టి సిరీస్ కు ఎంపికయ్యారు.ఈ సిరీస్ తో రీ ఎంట్రీ ఆశించిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మాత్రం. భంగపాటే ఎదురైంది. ముంబై వేదికగా నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాండ్యా విఫలమయ్యాడు. దీంతో న్యూజిండ్ ఇండియా-ఎ పర్యటన జట్టులో చోటుకోల్పోయాడు.

Story first published: Monday, January 13, 2020, 14:46 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X