For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: సంజూ శాంసన్

టాలీవుడ్ టాప్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసన్ తెలిపాడు. మలయాళిగా అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూస్తానని ఓ ర్యాపిడ్ ఫైర్ చిట్ చాట్‌లో వెల్లడించాడు. అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనకు ఇష్టమని సంజూ శాంసన్ వెల్లడించాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో సంజూ శాంసన్(50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు ఫ్యాన్స్.. సంజూ శాంసన్ తమ అభిమాన హీరోల గురించి చేసిన వ్యాఖ్యలను నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

సంజూ కాదు.. అతని వల్లే గెలిచాం: గంభీర్సంజూ కాదు.. అతని వల్లే గెలిచాం: గంభీర్

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..

ఐపీఎల్ 2022 సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియ హ్యాండిల్ జరిపిన చిట్ చాట్‌లో సంజూ శాంసన్.. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. అతని సినిమాలు ఇష్టంగా చూస్తానని వెల్లడించాడు. పుష్ప సినిమా విడుదలైనప్పుడు మైదానంలో క్యాచ్ పట్టిన తర్వాత అల్లు అర్జున్ ట్రేడ్ మార్క్ తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సంజూ సెలెబ్రేట్ చేస్తున్నాడు. ఈ సెలెబ్రేషన్స్‌కు ఫిదా అయిన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా సంజూను అభినందించాడు.

India Wicket Keeper Sanju Samson Reveals His Favorite Telugu Hero
Photo Credit: twitter (X)

మహేష్ బాబు అంటే కూడా..

మహేష్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటాయని కూడా సంజూ తెలిపాడు. ఎక్స్ వేదికగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో సౌత్ హీరోల గురించి మాట్లాడిన సంజూ.. మహేష్ బాబు క్లాస్ యాక్టింగ్ తనకు ఇష్టమని తెలిపాడు. గతంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సంజూ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశాడు.

'RRR' సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు సంజూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. చిత్ర యూనిట్‌ను కొనియాడుతూ పోస్ట్ పెట్టాడు. సౌత్ ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. కోహ్లీ, రోహిత్ రికార్డ్ బద్దలు!చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. కోహ్లీ, రోహిత్ రికార్డ్ బద్దలు!

రజినీ ఫ్యాన్..

సంజూ కేరళ వాసి కావడంతో మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలతో అతనికి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కానీ, తెలుగు మాస్ మసాలా సినిమాలు తనకు బాగా నచ్చుతాయని, తెలుగు మాస్ సాంగ్స్ తనలో ఉత్తేజాన్ని నింపుతాయని సంజూ ఓ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తాను డై హార్డ్ ఫ్యాన్ అని తెలిపిన సంజూ.. ఓ ఇంటర్వ్యూలో అరుణాచలం సినిమాలోని డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించాడు.

Story first published: Tuesday, March 3, 2026, 7:10 [IST]
Other articles published on Mar 3, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+