న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. శాంసన్‌పై వేటు.. భారత జట్టు ఇదే!!

India Vs NewZealand T20 Squad : Pant, Rohit Sharma Into Squad, Sanju Samson Neglected || Oneindia
Rohit, Shami back in India T20I squad for New Zealand series, Samson omitted

ముంబై: సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసాక భారత్‌ ఈ నెలలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడనుంది. మొదట 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటి ఆదివారం రాత్రి జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ ప్రకటించింది.

<strong>హార్దిక్‌లానే నేను ఉంటా.. కపిల్‌, స్టోక్స్‌తో పోల్చుకోను!!</strong>హార్దిక్‌లానే నేను ఉంటా.. కపిల్‌, స్టోక్స్‌తో పోల్చుకోను!!

శాంసన్‌పై వేటు

శాంసన్‌పై వేటు

శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న వైస్‌ కెప్టెన్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ తిరిగి జట్టులో చేరాడు. సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ కూడా జట్టులోకి తిరిగొచ్చాడు. రోహిత్‌ రాకతో కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌పై వేటు పడింది. సుదీర్ఘ విరామం తర్వాత లంకతో జరిగిన మూడో టీ20లో శాంసన్‌ ఆడిన విషయం తెలిసిందే. మొదటి బంతికే సిక్సర్‌ కొట్టి.. రెండో బంతికి పెవిలియన్ చేరాడు.

వన్డే, టెస్టు జట్ల ఎంపిక వాయిదా

వన్డే, టెస్టు జట్ల ఎంపిక వాయిదా

న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆదివారమే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్‌ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది. దీనికి హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది. పాండ్యా ఫిట్‌నెస్‌లో విఫలమైనట్టు శనివారం వార్తలు రాగా.. అతడి కోచ్‌ మాత్రం వాటిని ఖండించాడు.

2018-2019 వార్షికోత్సవం

2018-2019 వార్షికోత్సవం

జట్టును ప్రకటించే ముందు ముంబైలో 2018-2019 వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్టార్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను భారత క్రికెట్‌లోని అత్యున్నత పురస్కారమైన పాలీ ఉమ్రిగర్‌తో సన్మానించింది. మహిళా క్రికెటర్లలో పూనమ్‌ పాండేకు ఈ అరుదైన పురస్కారం లభించింది. మయాంక్‌ అగర్వాల్‌ అత్యుత్తమ అరంగేట్ర ఆటగాడిగా ఎంపికయ్యాడు. మహిళా క్రికెట్‌లో షెఫాలీ వర్మ ఈ అవార్డు దక్కించుకుంది.

టీ20 జట్టు

టీ20 జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, శివం దూబే, కుల్దీప్ యాదవ్‌‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌.

Story first published: Monday, January 13, 2020, 8:30 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X