న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మమ్మల్ని బహిష్కరించమని ఐపీఎల్‌కు చైనా స్పాన్సరా?.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

Fans slam BCCI for keeping Chinese brand as IPL sponsor

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు స్పాన్సర్‌గా చైనా కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన ఐపీఎల్‌‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నదమవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో లీగ్ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ నేతృత్వంలో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ షెడ్యూల్, ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర విషయాలతో పాటు చైనా మొబైల్ కంపెనీ వివో స్పాన్సర్‌షిప్ కొనసాగించడంపై తుది నిర్ణయం తీసుకుంది.

వీవోను కొనసాగించక తప్పదు..

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. ఐదేళ్ల వరకు (2022) ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసి, కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేనందున వివోను కొనసాగించక తప్పలేదని ఓ పాలక మండలి సభ్యుడొకరు తెలిపారు. అయితే జూన్ నెలలో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా డ్రాగన్ కంట్రీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.

చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రజలు కూడా జవాన్లకు మద్దుతుగా ఆ దేశ వస్తువులను స్వచ్చందంగా బహిష్కరించారు. ఇక భారత ప్రభుత్వం కూడా చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌కు వివో స్పాన్సర్‌షిప్ కొనసాగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

వీర జవాన్లను అవమానపరిచనట్టే..

దీంతో ప్రజలు, రాజకీయ నాయకులు భారత క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు చైనా వస్తువులను బహిష్కరించమని చెప్పి.. ఏంచక్కా మీరు స్పాన్సర్‌షిప్‌లు కొనసాగించుకుంటారా?'అని మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భారత జవాన్లను అవమానపరిచినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ దేశం బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే.. భారత బోర్డు మాత్రం ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించడం లేదని కామెంట్ చేస్తున్నారు. ‘ఐపీఎల్‌నైనా రద్దు చేయండి లేకుంటే స్పాన్సర్‌నన్నా తీసేయండి'అని డిమాండ్ చేస్తున్నారు.

బాయ్‌కట్ ఐపీఎల్ 2020

బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. తాము ఈ సీజన్ ఐపీఎల్ చూడమని, బహిష్కరిస్తామని కొంత మంది అభిమానులు హెచ్చరిస్తున్నారు. ట్విటర్ వేదికగా బాయ్‌కట్ ఐపీఎల్ 2020 యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. చైనా కంపెనీని స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నందుకు బీసీసీఐకి సిగ్గుండాలని ఘాటుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దేశం కంటే బీసీసీఐ డబ్బే ఎక్కువైందని కూడా విమర్శిస్తున్నారు. బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని భారత ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

జమ్ము మాజీ సీఎం ఫైర్

లద్దాఖ్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రజలంతా చైనా వస్తువులను బహిష్కరిస్తుంటే.. ఐపీఎల్‌కు మాత్రం చైనా స్పాన్సర్‌ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ధ్వజమెత్తారు. ‘చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్‌ఫోన్‌ ఉత్పత్తిదారులను ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే... ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు'' అని ఆయన ట్వీట్ చేశాడు.

లంక ప్రీమియర్‌ లీగ్‌‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ క్లారిటీ

Story first published: Monday, August 3, 2020, 22:03 [IST]
Other articles published on Aug 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X