న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: డివిలియర్స్ ఆ జట్టును వదిలేయ్.. ముంబైలోకి వచ్చేయ్!

Fans request AB de Villiers to switch team after he congratulates MI for IPL 2020 title

హైదరాబాద్: సుమారు రెండు నెలలపాటు అలరించిన ఐపీఎల్ 2020 సీజన్ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన టైటిల్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో గెలుపొందింది. ఫలితంగా ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన ముంబై..ఫైనల్లో కూడా అలవోక విజయాన్నందుకుంది. ఇక అద్భుత విజయాన్నందుకున్న రోహిత్ సేనపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ట్విటర్ వేదికగా రోహిత్ సేనకు అభినందనలు తెలిపాడు.

నో డౌట్..

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బెస్ట్ టీమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదని మిస్టర్ 360 ఏబీడీ తెలిపాడు. ‘వెల్‌డన్ ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది బెస్ట్ టీమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు'అని ట్రోఫీ అందిస్తున్న ఐపీఎల్ వీడియో ట్వీట్‌‌ను రీట్వీట్ చేశాడు. ఇక ఏబీడీ ట్వీట్‌పై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వదిలేయాలని సూచిస్తున్నారు.

మిస్టర్ 360.. కోహ్లీని వదిలేయ్..

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టులో ఉంటే ఎప్పటికీ టైటిల్ గెలవలేవని, వెంటనే ఆ జట్టు నుంచి తప్పుకోవాలని కామెంట్ చేస్తున్నారు. వచ్చే సీజన్‌లోనైనా బెట్ టీమ్‌ను ఎంచుకోమని ఒకరంటే.. ముంబై ఇండియన్స్ వచ్చేయమని మరొకరు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్‌లో ఏబీడి కింగ్ అని, అతను ఆర్‌సీబీని వీడాలని ట్వీట్ చేస్తున్నారు. కోహ్లీని నమ్ముకుంటే ఎప్పటికీ ఐపీఎల్ టైటిల్ సాధించలేవని కూడా ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరిస్తున్నారు.

PL 2020 : RR got AB’d, Says Steve Smith As De Villiers Shines for RCB | RR Vs RCB | Oneindia Telugu
టైటిల్ అందుకోని ఏబీడీ..

టైటిల్ అందుకోని ఏబీడీ..

ఇక సీజన్ ఆరంభం నుంచి ఐపీఎల్ ఆడుతున్న డివిలియర్స్ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా అందుకోలేదు. ప్రారంభంలో ఢిల్లీకి ఆడిన ఈ సౌతాఫ్రికా దిగ్గజం.. 2011 నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లోనే సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడు కూడా ఏబీడీనే. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డివిలియర్స్.. ఈ సీజన్‌లో సూపర్ ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. కానీ అతనికి సహకారం అందకపోవడంతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కే పరిమితమైంది. ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ఏబీడీ.. 158.74 స్ట్రైక్ రేట్‌తో 454 రన్స్ చేశాడు.

IPL 2021: మరో కొత్త ఫ్రాంచైజీ.. కార్పోరేట్ కంపెనీతో టీమ్‌ను కొనుగోలు చేయనున్న సౌతిండియా హీరో!

Story first published: Wednesday, November 11, 2020, 21:39 [IST]
Other articles published on Nov 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X