Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: మరో కొత్త ఫ్రాంచైజీ.. కార్పోరేట్ కంపెనీతో టీమ్‌ను కొనుగోలు చేయనున్న సౌతిండియా హీరో!

IPL 2021: Is South Indian actor Mohanlal trying to buy the 9th franchise?
IPL 2021 : Is South Indian Actor Mohanlal Bidding For 9th Franchise In IPL 2021? | Oneindia Telugu

హైదరాబాద్: ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్‌ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్‌రేట్‌ల దాగుడుమూతలతో ఐపీఎల్‌ 2020 అభిమానులను కనువిందు చేసింది. ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకున్నా.. టీవీలకు అతుక్కునేలా సక్సెస్‌ఫుల్‌గా సాగింది. చివరకు కొత్త విజేత రాకుండానే ముగిసింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మళ్లీ టైటిల్‌ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఇప్పటి వరకు నాలుగు టైటిల్స్‌తో శిఖరాన నిలబడిన రోహిత్‌ సేన మరో ట్రోఫీతో తమ ఘనతను మరింత పదిలం చేసుకుంది. ఇలా ఐపీఎల్ 2020 ముగిసిందో లేదో.. అలా వచ్చే సీజన్‌ ముచ్చట్లు మొదలయ్యాయి.

మరో కొత్త జట్టు..

మరో కొత్త జట్టు..

ఇక ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే సీజన్‌లో మరో జట్టు రాబోతుందని తెలుస్తోంది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా వచ్చే సీజన్‌ ఏప్రిల్-మేలో జరుగుతుందని, భారత్‌లోనే నిర్వహిస్తామని ఇటీవల స్పష్టం చేశాడు. సమయం తక్కువగా ఉండటంతో ఐపీఎల్ 2021కు సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త ఫ్రాంచైజీ రాబోతుందని, కరోనా కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ కొత్త జట్టును తీసుకురానుందని ప్రచారం జరుగుతుంది.

భారీ వేలానికి బీసీసీఐ కసరత్తులు

కొత్త ఫ్రాంచైజీ రాకతో పూర్తి స్థాయిలో మెగా వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నద్ధం అవుతోందట. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీలకు ఓ ఇండికేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతీ సీజన్ వేలం డిసెంబర్‌లోనే జరుగుతుంది, కానీ ఈ సారి మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని సమాచారం. స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.

సౌత్ హీరో ఆసక్తి..

సౌత్ హీరో ఆసక్తి..

ఇక కొత్తగా వచ్చే ఫ్రాంచైజీ కోసం మొబైల్ అప్లికేషన్ కంపెనీ ‘బైజుస్' సౌతిండియా స్టార్, మళయాళం హీరో మోహన్ లాల్ బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన హాజరు కావడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్‌కు మోహన్ ‌లాల్ హాజరయ్యారు. వాస్తవానికి ఈ సీజన్‌లో ప్రేక్షకులకు అనుమతి లేదు. కానీ మోహన్ లాల్ రావడంతో కొత్త ఫ్రాంచైజీ కోసమే వచ్చారని, బైజుస్‌తో కలిసి కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ కూడా దాఖలు చేశారని ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతానికైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అహ్మదాబాద్‌ బేస్డ్‌ ఫ్రాంచైజీ

అహ్మదాబాద్‌ బేస్డ్‌ ఫ్రాంచైజీ

9వ జట్టు అహ్మదాబాద్‌ బేస్డ్‌గా ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఓవైపు చర్చ జరుగుతుండగా.. మోహన్‌లాల్ ఎంట్రీతో కేరళ బేస్డ్‌గా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి కొత్త జట్టు వస్తే.. టోర్నీ సమయం, మ్యాచుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. గుజరాత్ క్రికెట్ సంఘం అహ్మదాబాద్‌లో 1.10 లక్షల సిట్టింగ్ కెపాసిటీతో మొతేరా స్టేడియాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ భారీ మైదానాన్ని మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం ఆరంభించారు. కొత్త జట్టు వస్తుందా? వస్తే ఏ సిటీ బేస్ట్‌గా వస్తుంది? మోహన్‌లాల్ కో ఓనర్‌గా ఉంటాడా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

విరాట్ కోహ్లీ లేని టెస్ట్ సిరీసా? ఆస్ట్రేలియా సులువుగా గెలుస్తోంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్యం!

Story first published: Wednesday, November 11, 2020, 19:40 [IST]
Other articles published on Nov 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+