న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఆడితే ప్రపంచకప్ గెలుస్తుందని ప్రతి ఒక్కరు అన్నారు: అశ్విన్

Everybody says if Ashwin plays, India will win the World Cup

న్యూఢిల్లీ: 2011 ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో మీడియా, అభిమానులు తనకిచ్చిన ప్రేరణ మరవలేదని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. వారి ప్రోత్సాహంతోనే ఆ మెగాటోర్నీలో అత్యద్భుత ప్రదర్శన కనబర్చానని తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అశ్విన్ ఆడితే భారత్ తప్పకుండా ప్రపంచకప్ గెలుస్తుందని ప్రతీ ఒక్కరు అన్నారని ఈ సీనియర్ స్పిన్నర్ గుర్తు చేసుకున్నాడు.

ఆ హెడ్డింగ్స్ చదివేవాడిని..

ఆ హెడ్డింగ్స్ చదివేవాడిని..

‘ఆ ప్రపంచకప్ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పటికి నేను వన్డే క్రికెట్ కూడా అంతగా ఆడలేదు. ఆ మెగా టోర్నీకి ముందు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. కానీ అందులో అత్యద్భుత ప్రదర్శన కనబర్చా. ఇక ప్రపంచకప్‌లో తుది జట్టులో ఆడకున్నా.. ప్రతి రోజు ఉదయాన్నే లేచేవాడిని. అశ్విన్ తుది జట్టులో ఉండాలి, ఆడాలనే అనే న్యూస్ పేపర్ల హెడ్డింగ్స్ చదివేవాడిని.'అని తెలిపాడు.

అభిమానుల నమ్మకంతోనే..

అభిమానుల నమ్మకంతోనే..

ఇక ప్రపంచకప్ తర్వాత ఐదేళ్లలోనే భారత్ నెంబర్ వన్ స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. కెరీర్ ప్రారంభంలో మాత్రం హర్భజన్ సింగ్ కారణంగా కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. అయితే అభిమానులు తనపై ఉంచిన నమ్మకం తనను ముందుకు నడిపించిందననాడు.

‘భజ్జుపా తుది జట్టులో ఉన్నప్పుడు జట్టులో చోటు దక్కించుకోవడం నాకు చాలా కష్టమైంది. కానీ ఆడాలనే కసి మాత్రం మరింత పెరిగింది. ప్రతీ క్రికెటర్ కూడా తుది జట్టులో ఆడాలనుకుంటాడు. అలానే నేను కూడా ఖచ్చితంగా ఆడాలని గట్టిగా అనుకునేవాడిని. అలాగే ఆ సమయంలో చాలా మంది నేను ఆడాలనుకునేవాళ్లు. నేను ఆడితే ప్రపంచకప్ భారత్ గెలుస్తుందని అనేవారు'అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

2 మ్యాచ్‌లు..4 వికెట్లు..

2 మ్యాచ్‌లు..4 వికెట్లు..

ఇక ఆ మెగాటోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించాడు. సౌతాఫ్రికా చేతిలో ఓడిన తర్వాత వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ధోనీ.. అశ్విన్ ఎంపిక చేయగా.. (2/41) రాణించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 80 పరుగులతో గెలుపొందింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన కీలక క్వార్టర్ ఫైనల్లో కూడా అశ్విన్ బరిలోకి దిగాడు.

కోహ్లీతో బాబర్ పోలికా..?

కోహ్లీతో బాబర్ పోలికా..?

ఇక పాకిస్థాన్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చడం సరికాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అది పాక్ క్రికెటర్‌కే చేటు చేస్తుందన్నాడు. ‘బాబర్ అజామ్‌ బ్యాటింగ్‌ నేను బాగా ఆస్వాదిస్తా. గతేడాది చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై అతను సాధించిన టెస్టు సెంచరీ మ్యాచ్ చూశా. అయితే.. విరాట్ కోహ్లీతో బాబర్ అజామ్‌ని పోల్చడం సరికాదు. నా అంచనా ప్రకారం కోహ్లీతో పోలిక బాబర్‌పై ఒత్తిడి పెంచుతుంది. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఓ అత్యుత్తమ క్రికెటర్‌గా ఇప్పటికే ఎదిగాడు. అలానే.. బాబర్ అజామ్ అదే బాటలో పయనిస్తున్నాడు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

నేను బొద్దుగా లేకుంటే మా అమ్మ నాకేదో అయిందనుకుంటది: విరాట్ కోహ్లీ

Story first published: Friday, July 24, 2020, 18:57 [IST]
Other articles published on Jul 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X