నేను బొద్దుగా లేకుంటే మా అమ్మ నాకేదో అయిందనుకుంటది: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డ పుష్టిగా తిని బొద్దుగా ఉండాలనుకుంటుంది. ఇప్పుడంటే డైట్, ఫిట్‌నెస్ ఫ్రీక్ అంటూ నోరు కట్టుకొని బరువు పెరగకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ ఒకప్పుడు ప్రతీ ఒక్కరు కడుపు నిండా తిని బొద్దుగా ఉండాటానికే ఇష్టపడేవారు. దీంతో ఏ తల్లైనా తన బిడ్డకు కడుపు నిండా తినిపించేది. తినకుంటే లాలించి, బతిమలాడి పెట్టేది. కొద్దిగా సన్నబడినా ఏదో అయిందని ఆందోళన పడేది. అది ఏ వయసులోనైనా తల్లికి కొడుకు చిన్నపిల్లాడే కదా.! ఇక భారత జట్టులో ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన తల్లి నుంచి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని అతనే.. తన సహచర క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
మా అమ్మతో చాలా కష్టం..
ఫిట్‌గా ఉండేందుకు తాను కొంచెం బరువు తగ్గినా తన తల్లిని ఒప్పించడం చాలా కష్టమని విరాట్ చెప్పుకొచ్చాడు. ‘నేను చాలా బలహీనంగా తయారవుతున్నానని మా అమ్మ తరుచూ నాతో అంటుంది. ఇది సాధరణమే. ప్రతీ తల్లి చెప్పేదే. అయితే ఈ తల్లులు మనం ఆడే ఆట పట్ల ఆటగాడిగా, ప్రొఫెషనల్‌గా ఉండటం మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోలేరు. తమ పిల్లలు బొద్దుగా కనిపించకుంటే వారికేదో అయిందని అనవసరంగా భయపడ్తారు. బలహీనంగా మారడానుకుంటారు. నేను బాగానే ఉన్నా. సిక్‌గా లేనని ప్రతీ రోజు మా అమ్మను కన్విన్స్ చేసేవాడిని. నా ఆట కోసం ఇలా తయారయ్యానని చెప్పేవాడిని. కానీ మా అమ్మను ఒప్పించడం చాలా కష్టమయ్యేది.

ఫన్నీగా.. చికాకుగా..
అయితే కొన్ని సార్లు చాలా ఫన్నిగా ఉండేది. మరికొన్నిస్లారు చికాకు కలిగేది. ఎందుకంటే మనం ఓ డైట్ ఫాలో అవుతున్నప్పుడు.. ప్రతీ ఉదయం నీవు బలహీనంగా తయారవుతున్నావనే మాటలు వినడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అవన్నీ మధుర క్షణాలే'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారే..
ఇక కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండే కోహ్లీ.. 2010 ప్రారంభంలో ఫిట్‌నెస్‌గా ఉంటేనే రాణించగలమని గ్రహించాడు. జిమ్‌లో అహర్నీషులు కష్టపడుతూ ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాడు. అది అతని ఆట మెరుగయ్యేందుకు ఉపయోగపడింది. రన్ మిషన్‌గా తయారు చేసింది. మైదానంలో అతని తిరుగేలేకుండా నిలబెట్టింది. ఇక కోహ్లీతో ప్రారంభమైన ఈ ఫిట్‌నెస్ సంప్రదాయం.. యావత్ దేశం పాకింది. ఇక భారత జట్టులోనైతే సిక్స్ ప్యాకర్లకు కొదవలేకుండా పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!