న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవడ్రా అక్కడ మ్యాచ్ పెట్టింది.. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌పై పేలుతున్నజోకులు, మీమ్స్.!

England vs West Indies first Test: Fans resort to memes and jokes as rain spoils international crickets return
England vs West Indies 1st Test 2020 : Funny Memes and Jokes Go Viral After Fans Upset

సౌతాంప్టన్: దాదాపు మూడునెలలు.. 117 రోజుల నీరిక్షణ తర్వాత ఎన్నో అంచనాలు.. మరెన్నో భావోద్వేగాల మధ్య బుధవారం ప్రారంభమైన ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌ను వరణుడే ఆడుకున్నాడు. తొలి రోజు ఆటకు పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. వర్షంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్‌ (55 బంతుల్లో 20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది.

ఆలస్యంగా ప్రారంభమైనా..

ఇక ఈ మ్యాచ్ ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్‌ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్‌ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్‌ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు.

దేవుడా.. కణికరించు

ఇక పడుతూ.. లేస్తూ సాగిన ఈ మ్యాచ్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంగ్లండ్ వేదికగా మ్యాచ్ ఎవడ్రా పెట్టిందని సెటైరిక్‌గా కామెంట్ చేస్తున్నారు. తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పదును పెట్టి నవ్వులు పూయించే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి మేం ముసులోల్లం అయ్యేలా ఉన్నాం.. పాకిస్థాన్‌లా ఇంగ్లండ్‌లో కూడా టోర్నీలు నిర్వహించవద్దని కామెంట్ చేస్తున్నారు. దేవుడా జర కణికరించనే మీమ్స్ షేర్ చేస్తున్నారు.

జాతి వివక్షకు సంఘీభావం..

అమెరికా నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ ఎవర్టన్‌ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్‌లు ధరించారు.

ధోనీకి రిటైర్మెంట్ ఆలోచన లేదు: మహీ మేనేజర్

Story first published: Thursday, July 9, 2020, 13:05 [IST]
Other articles published on Jul 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X