న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీకి రిటైర్మెంట్ ఆలోచన లేదు: మహీ మేనేజర్

MS Dhoni Manager Mihir Diwakar Says Mahi not thinking about retirement, determined to play IPL

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలు లేవని అతని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ తెలిపాడు. మంగళవారం 39వ పడిలో అడుగుపెట్టిన మహీ.. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఓటమి నుంచి ఆటకు దూరమయ్యాడు. దీంతో అతని భవితవ్యంపై రోజుకో పుకారు షికారు చేస్తుంది. ఇక తన గురించి ఎన్ని విమర్శలు వచ్చినా.. ఈ జార్ఖండ్ డైనమైట్ మాత్రం నోరు విప్పలేదు.

ప్రాక్టీస్ సెషన్‌లో..

ప్రాక్టీస్ సెషన్‌లో..

అయితే ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని అభిమానులు ఆశలు రేకెత్తించాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దవ్వడంతో అతని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ ద్వారా సత్తా చాటి టీ20 ప్రపంచకప్‌ ఆడి ఘన వీడ్కోలు అందుకోవాలనుకున్నా అతని ఆశలపై కోవిడ్-19 నీళ్లు చల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌పై గందరగోళం నెలకొనగా.. కనుచూపు మేరలో కూడా టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు కల్పించడం లేదు.

ఐపీఎల్ కోసం..

ఐపీఎల్ కోసం..

ధోనీ రిటైర్మెంట్‌ వార్తల గురించి తాజాగా అతని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ మాట్లాడుతూ ‘చిన్ననాటి స్నేహితులమైనప్పటికీ.. అతని క్రికెట్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుకోం. కానీ.. ధోనీ మాటల్ని బట్టి చూస్తుంటే.. అతనికి రిటైర్మెంట్ ఆలోచనే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతని లక్ష్యం ఒక్కటే ఐపీఎల్‌లో రాణించడం. దానికోసం ఈ ఏడాది ఆరంభంలో అతను దాదాపు 30 రోజులు చెన్నైలో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్‌ కోసం ధోనీ చాలా శ్రమిస్తున్నాడు'' అని వెల్లడించాడు.

సెప్టెంబర్‌లో

సెప్టెంబర్‌లో

ఐపీఎల్‌లో సత్తాచాటగలిగితే టీమిండియాలోకి ధోనీని ఎంపిక చేసేందుకు తమకేమీ అభ్యంతరం లేదని గత ఏడాది చివర్లోనే భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. కానీ.. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు మొదటి వారం వరకూ ఐపీఎల్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

జాతి వివక్షకు వ్యతిరేకంగా మైదానంలో వెస్టిండీస్-ఇంగ్లండ్ ఆటగాళ్ల నిరసన!

Story first published: Wednesday, July 8, 2020, 21:43 [IST]
Other articles published on Jul 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X