న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: చెలరేగిన బ్రాడ్, అండర్సన్ .. ప్యాకప్ అంచున పాక్!

England vs Pakistan: Pakistan Reach 223/9 As Bad Light Forces Early Stumps On Day 2

సౌతాంప్టన్‌: వాతావరణంలో మార్పులేదు.. పాకిస్థాన్ బ్యాటింగ్‌లో తేడా కనిపించలేదు. తొలిరోజులానే పడుతూ లేస్తూ.. సాగిన ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్ మరోసారి నిరాశపర్చారు. మహ్మద్ రిజ్వాన్(116 బంతుల్లో 5 ఫోర్లతో 60 బ్యాటింగ్) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో ఓ మోస్తరు స్కోర్‌నే సాధించింది. మొత్తానికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో.. శుక్రవారం బ్యాడ్‌లైట్‌తో ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 రన్స్ చేసింది.

రిజ్వా‌న్‌తో పాటు నసీమ్ షా(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బాబర్ ఆజమ్(127 బంతుల్లో 3 ఫోర్లతో 47 హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. అండర్సన్, బ్రాడ్ చెరో 3 వికెట్లు తీశారు.

వర్షంతో ఆలస్యం..

వర్షంతో ఆలస్యం..

ఉదయం వర్షం కారణంగా మ్యాచ్ 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. 126/5 ఓవర్‌నైట్‌ స్కో‌ర్‌తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ లంచ్ వరకు నిలకడగానే ఆడింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్.. ఇంగ్లండ్ స్వింగ్ బౌలర్లను ఆచితూచి ఆడారు. ఎక్కువ డిఫెన్స్‌కు చూపడంతో ఈ సెషన్‌లో 29 పరుగులు మాత్రమే వచ్చాయి.

రిజ్వాన్ ఒంటరి పోరాటం..

రిజ్వాన్ ఒంటరి పోరాటం..

ఇక లంచ్ బ్రేక్‌ తర్వాత కొద్దిపేసటికే బాబర్‌ ఆజమ్‌ రూపంలో పేసర్‌ బ్రాడ్‌ పాక్‌ కీలక వికెట్‌ తీశాడు. గుడ్ లెంగ్త్ బంతిని ఆడే క్రమంలో బాబర్.. కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆరో వికెట్‌కు నమోదైన 38 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. అటు కీపర్‌ రిజ్వాన్‌ మాత్రం ఓపిగ్గా క్రీజులో నిలిచి ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ మరో వైపు పాక్‌ యాసిర్‌ షా (5), షహీన్‌ అఫ్రీది (0) వికెట్లను కోల్పోయింది. 176/8 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన వేళ.. మహ్మద్‌ అబ్బాస్‌ (2) కాస్త నిలబడడంతో రిజ్వాన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు స్కోరును 200 దాటించాడు.

రెండు గంటలు వేచి చూసినా..

రెండు గంటలు వేచి చూసినా..

ఈ సమయంలో వెలుతురు లేమితో ముందుగానే టీ బ్రేక్‌కు వెళ్లారు. ఇక చివరి సెషన్‌ ఆరంభమైన పది నిమిషాలకే మరోసారి వెలుతురు మందగించడంతో ఆటను నిలిపేశారు. అయితే ఆ లోపే అబ్బాస్‌ వికెట్‌ను కూడా పాక్‌ కోల్పోయింది. రెండు గంటలపాటు వేచి చూసినా సరైన వెలుతురు రాకపోవడంతో ఆటను రద్దు చేశారు. గురువారం 45.4 ఓవర్లు ఆట కొనసాగితే.. శుక్రవారం 40.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

సంక్షిప్త స్కోరు:

సంక్షిప్త స్కోరు:

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 (అబిద్‌ అలీ 60, బాబర్‌ ఆజమ్‌ 47, మహ్మద్‌ రిజ్వాన్‌ 60 బ్యాటింగ్‌, అండర్సన్‌ 3/48, బ్రాడ్‌ 3/56).

నా పుట్టుకే చావుతో పోరాటం.. ఆస్తమాతోనే 500 వికెట్లు తీసా: స్టువర్ట్ బ్రాడ్

1
46763
Story first published: Saturday, August 15, 2020, 10:38 [IST]
Other articles published on Aug 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X