న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా పుట్టుకే చావుతో పోరాటం.. ఆస్తమాతోనే 500 వికెట్లు తీసా: స్టువర్ట్ బ్రాడ్

England vs Pakistan: Why Stuart Broad required an inhaler during Southampton Test against Pakistan

సౌతాంప్టన్: పాకిస్థాన్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కొంచెం అసౌకర్యంగా కనిపించాడు. వెంటనే ఇన్‌హెలర్ తీసుకురావాలని సహచర ఆటగాళ్లకు సూచించాడు. వారు అది తీసుకురావడంతో అస్తమా రోగిలా ఇన్‌హెలర్ సాయంతో శ్వాస తీసుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఓ ఇంటర్నేషనల్ ఆటగాడికి ఆస్తమా ఉంటుందా? అని అనుమానపడ్డారు.

పుట్టుకతోనే ఆస్తమా..

పుట్టుకతోనే ఆస్తమా..

కానీ బ్రాడ్ దీర్ఘకాలికంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఆస్తమాతోనే క్రికెట్ ఆడుతూ టెస్ట్‌ల్లో 500 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని అతనేం దాయలేదు కూడా. 2015లో యాషెస్ సిరీస్‌ సందర్భంగా ప్రపంచానికి తెలియజేశాడు. తన పుట్టడమే చావు కొరల్లో పుట్టానని, నెలలు నిండకు ముందే జన్మించడంతో ఊపిరితిత్తులు పూర్తిగా నిర్మితం కాలేదన్నాడు. ఆ కారణంతోనే ఆస్తమాతో బాధపడుతున్నానని, ఇన్ హెలర్ ఉపయోగిస్తున్నానని స్పష్టం చేశాడు.

పుట్టుకే చావుతో పోరాటం..

పుట్టుకే చావుతో పోరాటం..

‘యాషెస్ సిరీస్ ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లో ఆటగాళ్లమంతా తమ గురించి ఎవరీకి తెలియని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాం. అయితే నేను నాకు అందరిలా కాకుండా ఒకటిన్నర లంగ్స్ మాత్రమే ఉన్నాయని, మూడు నెలలు ముందుగా పుట్టడంతో సరిగ్గా నిర్మితం కాలేదని చెప్పా. నా మాటలు విన్నవారంతా షాక్ గురయ్యారు.

నా పుట్టుకే చావుతో పోరాటం. నెలలు నిండకముందే పుట్టడంతో నా ఊపిరితిత్తుల్లోని ఒకటి పూర్తిగా డెవలప్ కాలేదు. అందుకే నేను ఆస్తమాతో బాధపడుతున్నా. ఇన్‌హెలర్ ఉపయోగిస్తున్నా. ఓ క్రీడాకారుడిగా ఇది నాపై ప్రభావం చూపలేదు. సగం లంగ్స్‌తోనే కెరీర్ మొత్తం కొనసాగించననే ఆలోచనే అద్భుతం అనిపిస్తుంది.'అని బ్రాడ్ తెలిపాడు.

ఏడో బౌలర్‌గా

ఏడో బౌలర్‌గా

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్‌ సిరీస్‌తోనే బ్రాడ్ 500 వికెట్ల మైలురాయి అందుకున్న విషయం తెలిసిందే. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేయడం ద్వారా 500వ వికెట్‌ను బ్రాడ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్‌గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్‌ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండవ బౌలర్‌గా ఘనతను అందుకున్నాడు.

అత్యధిక టెస్ట్ వికెట్ల జాబితాలో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ‌(800), షేన్ వార్న్‌ (708), అనిల్ కుంబ్లే (619), జేమ్స్‌ అండర్సన్ ‌(589), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563), కౌట్నీ వాల్ష్ ‌( 519) ఉన్నారు.

 రెండో రోజు ఆటకు అంతరాయం..

రెండో రోజు ఆటకు అంతరాయం..

ప్రతీకూల వాతావరణం కారణంగా ఇంగ్లండ్-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు ఆట ఆలస్యం కానుంది. వర్షం కారణంగా తొలి రోజు 45.4 ఓవర్లే సాగగా.. ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా రెండో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరీక్షించారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ అజామ్(25 బ్యాటింగ్), రిజ్వాన్(4 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ అబిద్ అలీ(60) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫస్ట్ టెస్ట్ సెంచరీ హీరో షాన్ మసూద్(1), కెప్టెన్ అజర్ అలీ(20), అసద్ షఫీక్(5), ఫవాద్ అలామ్(0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్, కరన్, వోక్స్, తలో వికెట్ పడగొట్టారు.

ఫస్ట్ సెంచరీ, రక్తపు జెర్సీతో ఆడిన మ్యాచ్ వరవలేనిది: సచిన్ టెండూల్కర్

Story first published: Friday, August 14, 2020, 17:05 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X