న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ స్మిత్ ఏందీ తొండాట.. ఆస్ట్రేలియా చీటింగ్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్ !

England vs Australia: Controversy erupts over Steve Smith’s catch near the boundary rope

సౌతాంప్టన్: ఇంగ్లండ్ గడ్డపై మూడు టీ20ల సిరీస్‌‌ను 2-1తో చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆఖరి టీ20లో గెలిచి పరువు దక్కించుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు చేసిన చీటింగ్ ఆలస్యంగా వెలుగు చూసింది. అంపైర్ల అలసత్వంతో ఇంగ్లండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. దీనిపై యావత్ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్ల తప్పిదాన్ని.. ఆసీస్ ఆటగాళ్ల చీటింగ్‌ను సాక్ష్యాలతో సహా ప్రస్తావిస్తూ మండిపడుతున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే?

చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లండ్‌ టీ20 జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ జట్టును నడిపించాడు. అయితే అతను ఔటైనా విధానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 16.5వ బంతిని డీప్ మిడ్ వికెట్‌మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే ఆ దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ చాకచక్యంగా బంతిని అందుకున్నాడు. సమన్వయం కోల్పోతున్నట్లు గ్రహించిన అతను బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి క్యాచ్ పట్టాడు. స్మిత్ సూపర్ క్యాచ్‌‌తో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

థర్డ్ అంపైర్ పరీక్షించి..

థర్డ్ అంపైర్ పరీక్షించి..

ఇక ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చినా.. బంతిని అందుకునే క్రమంలో స్మిత్ పాదం ఏమైనా బౌండరీ లైన్ తాకిందా? అనే కోణంలో థర్ట్ అంపైర్ వీడియోను పలుమార్లు పరిశీలించాడు. అయితే అలా తాకినట్లు సరైన సాక్ష్యం లభించకపోవడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. దీంతో మొయిన్ అలీ(21) భారంగా క్రీజును వీడాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో స్మిత్ పాదం బౌండరీ లైన్‌కు తాకినట్లు వీడియోలో స్పష్టమవుతుంది. స్కై స్పోర్ట్స్ కామెంటేటర్ మైఖెల్ అథెర్టన్ మాత్రం అది స్మిత్ షూ నీడ అని అభిప్రాయపడ్డాడు. ‘స్మిత్ క్యాచ్ అందుకునే క్రమంలో అతను పాదం బౌండరీ ఎడ్జ్‌కు తాకినట్లు అనిపిస్తుంది. కానీ అది అతని ఫూట్ షాడో'అని తెలిపాడు.

ఆసీస్ చీటింగ్.. పక్కా సిక్స్..

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆసీస్ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంపైర్ల అలసత్వాన్ని నిలదీస్తున్నారు. అది పక్కా సిక్స్ అని స్పష్టంగా వాదిస్తున్నారు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోను నిశితంగా పరిశీలించి సాక్ష్యాధారాలతో ట్వీట్ చేస్తున్నారు. మ్యాచ్‌కు నాణ్యమైన కెమెరాలు పెట్టి పరిశీలించాలి, అది పక్కా సిక్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు స్మిత్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చీటింగ్ చేయడం కొత్తేం కాదని మండిపడుతున్నారు. ఇక స్మిత్‌ను వెనుకెసుకొచ్చే వాళ్లు కూడా ఉన్నారు. అంపైర్లే కనిపెట్టలేనప్పుడు స్మిత్‌కు ఎలా తెలుస్తుందని వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గెలిపించిన మిచెల్ మార్ష్

గెలిపించిన మిచెల్ మార్ష్

టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (44 బంతుల్లో 55) అర్ధ సెంచరీ చేయగా... డేవిడ్‌ మలాన్‌ (21), మొయిన్‌ అలీ (23), డెన్లీ (29 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా రెండు వికెట్లు తీయగా... స్టార్క్, హాజెల్‌వుడ్, రిచర్డ్‌సన్, అగర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.

అనంతరం ఆస్ట్రేలియా 19.3 ఓ వర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. ఒకదశలో 100 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాలో పడినట్లు కనిపించిన ఆసీస్‌ జట్టును మిచెల్‌ మార్ష్ (36 బంతుల్లో 39 నాటౌట్‌), అగర్‌ (16 నాటౌట్‌) విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 46 పరుగులు జోడించారు. అంతకుముందు కెప్టెన్‌ ఫించ్‌ (26 బంతుల్లో 39) దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

హర్భజన్ సింగ్‌కు రూ.4 కోట్లు ఎగ్గొట్టిన చెన్నై వ్యాపారి.. కేసు నమోదు!

Story first published: Thursday, September 10, 2020, 14:58 [IST]
Other articles published on Sep 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X