న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్: భారీ స్కోరు సాధించడంలో వార్నర్ విఫలం

Ashes 2019 : 'David Warner Missed Scoring Opportunities' Says Ricky Ponting || Oneindia Telugu
England vs Australia, Ashes 2019: David Warner missed scoring opportunities, says Ricky Ponting

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భారీ స్కోరు సాధించడంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ విఫలమవుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికే పట్టం కట్టిన బీసీసీఐ

దీంతో ఈ యాషెస్‌ సిరిస్‌లో వార్నర్‌ మూడు సార్లు బ్రాడ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అంతకముందు ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వార్నర్... స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో వార్నర్ ప్రదర్శనపై రికీ పాంటింగ్ మీడియాతో మాట్లాడాడు.

"వార్నర్‌ యాషెస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. భారీ స్కోరు సాధించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇది అతడిని నిరాశకు గురిచేసే అంశం. దూరంగా వెళ్తున్న బంతుల్ని అతడు కట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బంతిని పూర్తిగా అంచనా వేయడంలో విఫలమవ్వడంతో అది ఎడ్జ్‌ తీసుకుంటుంది" అని అన్నాడు.

"దీంతో బంతి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు చేరుతుంది. షార్ట్‌ అండ్‌ వైడ్‌ బంతుల్ని అతడు పూర్తి విశ్వాసంతో ఎదుర్కోవాలి. బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించాలి. ఒత్తిడికి లోనవ్వకుండా బంతిని అంచనా వేస్తూ బ్యాటింగ్‌ చేయాలి" అని వార్నర్‌కు రికీ పాంటింగ్ సూచించాడు.

గుండెపోటు కాదు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్

బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో స్మిత్‌, వార్నర్‌ పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఇక, పునరాగమనం తర్వాత స్మిత్, వార్నర్‌లు ఆడోతున్న తొలి టెస్టు టెస్టు సిరిస్ యాషెస్ కావడం గమనార్హం. తొలి టెస్టులో స్మిత్‌ 144, 142 పరుగులతో అదరగొట్టాగా వార్నర్‌ (2, 8) మాత్రం రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోయాడు.

ఆస్ట్రేలియా పేసర్లు హాజెల్‌వుడ్‌ (3/58), కమిన్స్‌ (3/61)తో పాటు స్పిన్నర్‌ లయన్‌ (3/68) చెలరేగడంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 77.1 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Saturday, August 17, 2019, 10:03 [IST]
Other articles published on Aug 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X